Major: మన సైనికుడిని నెత్తిన పెట్టుకున్న పాకిస్థాన్!

ABN , First Publish Date - 2022-07-09T23:57:06+05:30 IST

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావడం కోసం కష్టాలు పడుతుంటే.. చిన్న హీరో అడివి శేష్ (Adivi Sesh) నటించిన ‘మేజర్’ మూవీ మాత్రం మొదటి రెండు రోజులకే బ్రేక్

Major: మన సైనికుడిని నెత్తిన పెట్టుకున్న పాకిస్థాన్!

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కావడం కోసం కష్టాలు పడుతుంటే.. చిన్న హీరో అడివి శేష్ (Adivi Sesh) నటించిన ‘మేజర్’ మూవీ మాత్రం మొదటి రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ అవడమే కాకుండా కోట్లు కురిపించింది. 26/11 ముంబై అటాక్స్‌లో హీరోగా నిలిచి.. వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ (Major Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్‌’ (Major) చిత్రంలో అడివి శేష్‌ లీడ్‌ రోల్‌ పోషించాడు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇటివలే థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా, ఓటీటీలో కూడా సత్తా చాటుతోంది. జూలై 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న మేజర్, నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ టాప్ 1, 2 పొజిష‌న్లలో దూసుకుపోతోంది. ‘మేజర్‌’ హిందీ వెర్షన్‌ టాప్‌ 1లో ట్రెండ్‌ అవుతుండగా, తెలుగు వెర్షన్‌ 2 స్థానంలో ఉంది. ఇక విషయంలోకి వస్తే.. మన హీరో కథని మన ఆడియన్స్ చూస్తే కిక్ ఏముంది, మన సైనికుడి కథని... దాయాది దేశం అయిన పాకిస్తాన్ కూడా చూస్తోంది. అక్కడ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో మేజర్‌ మొదటి స్థానంలో ఉంది.


బంగ్లాదేశ్‌, శ్రీలంకలో కూడా ఈ చిత్రం టాప్‌ 1లోనే ఉంది. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన అడవి శేష్, మేజర్ మూవీ ఎక్కడెక్కడ టాప్‌లో ఉందో వివరంగా తెలిపాడు. క్వాలిటీ అండ్ కంటెంట్ ఉన్న సినిమాలని అతి  తక్కువ బడ్జెట్‌తో రూపొందించి హిట్స్ ఇచ్చే శేష్.. ‘మేజర్’ మూవీని పాకిస్తాన్‌లో కూడా టాప్ పొజిషన్‌లో పెట్టి.. సందీప్ ఉన్ని కృష్ణన్‌కి నిజమైన నివాళి ఇచ్చాడు. ఈ మూవీ చూసైనా, టెర్రరిస్టులు చేసే అరాచకాల కారణంగా ఎంత మంది బలి అవుతున్నారు? మన దేశం ఎలాంటి సైనికులని కోల్పోతుంది, దేశ భద్రత విషయానికి వస్తే మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాం? అనే విషయం పాకిస్తాన్‌లోని కొంతమందికైనా తెలిస్తే అదే ‘మేజర్’ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్.

Updated Date - 2022-07-09T23:57:06+05:30 IST