Major: ‘ఓహ్ ఇషా’ వీడియో సాంగ్‪కు సూపర్బ్ రెస్పాన్స్

ABN , First Publish Date - 2022-05-19T01:57:54+05:30 IST

వెర్సటైల్ యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ (Major). 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా..

Major: ‘ఓహ్ ఇషా’ వీడియో సాంగ్‪కు సూపర్బ్ రెస్పాన్స్

వెర్సటైల్ యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ (Major).  26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర సెకండ్ సింగల్ ‘ఓహ్ ఇషా’ (Oh Isha) వీడియో సాంగ్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్‪ను రాబట్టుకుంటూ.. విడుదలైన కొద్దిసేపటికే యూట్యూబ్‪లో టాప్‪లో ట్రెండ్ అవుతోంది.


‘‘హాయి హాయి హాయి

ఈ మాయ ఏమిటోయి

గుండె ఆగి ఆగి ఎగురుతున్నది

చిక్కులన్నీ కూర్చి ఓ లెక్కలేవో నేర్చి

అంకెలాటలేవో ఆడుతున్నది’’.. అంటూ సాగిన ఈ లవ్లీ మోలోడీకి రాజీవ్ భరద్వాజ్ (Rajiv Bharadwaj) సాహిత్యం అందించగా.. అర్మాన్ మాలిక్ (Armaan Malik), చిన్మయి శ్రీపాద ( Chinmayi Sripada) ఆలపించారు. లవ్లీ మెలోడీగా వచ్చిన ఈ పాట ఇన్సెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. శ్రీచరణ్ పాకాల (Sricharan Pakala) స్వరాలను సమకూర్చారు. ఒక గెట్ టుగెదర్‪లో ఆర్మీ అధికారుల తమ లైఫ్ పార్ట్నర్స్‪తో  డ్యాన్స్ చేస్తున్నపుడు మేజర్ సందీప్‪గా శేష్ తన తొలిప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో పాట మొదలైంది. కాలేజీ డేస్ ప్రేమలో వుండే అందం, అమాయకత్వంఈ పాటలో లవ్లీగా ప్రజంట్ చేశారు. 90లలో యంగ్ సందీప్ ఫస్ట్ లవ్‪ని ఈ పాటలో అందంగా చూపించారు. సందీప్ కాలేజీ డేస్‪లోని జ్ఞాపకాలని, లవ్లీ మూమెంట్స్‪ని ప్లజంట్‪గా చిత్రీకరించారు. ఈ పాటలో శేష్, సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) జోడి చాలా క్యూట్‪గా అలరించింది. శేష్ అచ్చూ కాలేజీ స్టూడెంట్‪లానే మేకోవర్ అవ్వడం చాలా నేచురల్‪గా వుంది. ఈ పాటలో సాయి మంజ్రేకర్ తన ఫోన్ నెంబర్‪ని ఒక్కొక్కటిగా ఇవ్వడం, ఇద్దరూ కెరీర్‪ని డిసైడ్ చేసుకోవడం, ఫ్యామిలీ.. ఇలా అందంగా లవ్లీ మాంటేజస్‪లో చూపించడం ఆకట్టుకుంటోంది.


26/11 ముంబై దాడులలో దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన బ్రేవ్ హార్ట్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌కు ఘనమైన నివాళిగా రూపొందిన ఈ చిత్రంలో.. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా మేజర్ సందీప్ జీవితంలోని అపూర్వ సంఘటనలు, అతని జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ చిత్రంలో కళ్ళకు కట్టినట్టు గ్రిప్పింగా చూపించబోతున్నారు. శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం శశి కిరణ్ తిక్కా (Sashi Kiran Tikka) దర్శకత్వంలో.. మహేష్ బాబు (Mahesh Babu) జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది.

Updated Date - 2022-05-19T01:57:54+05:30 IST