Adivi Sesh: 'మేజర్' Extraordinary సినిమా..

ABN , First Publish Date - 2022-05-22T17:52:33+05:30 IST

'మేజర్' (Major) ఎక్స్ట్రార్డినరీ సినిమా అని చిత్ర హీరో అడివి శేష్ (Adivi Sesh) అన్నారు. 'క్ష‌ణం' (Kshanam), 'ఎవ‌రు' (Evaru), 'గూఢ‌చారి' (Goodachari)

Adivi Sesh: 'మేజర్' Extraordinary సినిమా..

'మేజర్' (Major) ఎక్స్ట్రార్డినరీ సినిమా అని చిత్ర హీరో అడివి శేష్ (Adivi Sesh) అన్నారు. 'క్ష‌ణం' (Kshanam), 'ఎవ‌రు' (Evaru), 'గూఢ‌చారి' (Goodachari) వంటి చిత్రాలతో హీరోగా తకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు శేష్. బాహుబలి (Bahubali) వంటి సినిమాలలో కీలక పాత్రలు చేస్తూనే హీరోగా మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అడివి శేష్ 2008లో జ‌రిగిన‌ ముంబై ఉగ్ర దాడిలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ (Sandeep Unnikrishnan) జీవిత కథ ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శశికిరణ్ తిక్క (Sashi Kiran Tikka) దర్శకత్వం వహిస్తున్నారు. 


ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ (Saiee Manjrekar) అడివి శేష్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను జూన్ 3న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శేష్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించారు. దీనిలో పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.


వీటిలో టికెట్ రేట్లకు సంబంధించి ప్రశ్నను ఓ నెటిజన్ అడిగాడు. దీనిపై శేష్ క్లారిటీ ఇచ్చారు. 'మా సినిమాకి ఎలాంటి హైక్స్ ఉండవు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా ఏవైతే ధరలు ఉన్నాయో.. వాటితోనే 'మేజర్' సినిమా రిలీజ్ అవుతుంది'.. అని తెలిపారు. అంతేకాదు, 'సాధారణ ప్రేక్షకులకు మేజర్ ఎక్స్ట్రార్డినరీ సినిమా'.. అని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ వారు ఈ సినిమాను కలిసి నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకల ఈ మూవీకి సంగీత దర్శకుడు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషలలో విడుదలవబోతున్న 'మేజర్' ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి. 



Updated Date - 2022-05-22T17:52:33+05:30 IST