‘మేజ‌ర్’: హిందీ వెర్షన్‌ డబ్బింగ్‌లో అడివి శేష్

ABN , First Publish Date - 2022-01-01T03:11:21+05:30 IST

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం, యుక్తవయస్సు, సైన్యంలో చేరిన‌ అద్భుతమైన క్ష‌ణాల నుండి అతను అమరవీరుడైన ముంబై దాడి యొక్క విషాద సంఘటనల వరకు.. అతని జీవితంలోని విభిన్న కోణాలను స్పృశించేలా తెరకెక్కుతోన్న చిత్రం

‘మేజ‌ర్’: హిందీ వెర్షన్‌ డబ్బింగ్‌లో అడివి శేష్

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం, యుక్తవయస్సు, సైన్యంలో చేరిన‌ అద్భుతమైన క్ష‌ణాల నుండి అతను అమరవీరుడైన ముంబై దాడి యొక్క విషాద సంఘటనల వరకు.. అతని జీవితంలోని విభిన్న కోణాలను స్పృశించేలా తెరకెక్కుతోన్న చిత్రం ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను అడివి శేష్ పోషిస్తుండగా.. సూపర్ మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న‌ ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి ప్రస్తుతం హీరో అడవి శేష్ హిందీ వెర్షన్‌కి ఓన్‌గా డబ్బింగ్ చెబుతున్నారు.


ఆయన డబ్బింగ్ చెబుతున్న వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన అడవి శేష్.. ‘‘ ‘మేజ‌ర్’ మూవీ హిందీ డ‌బ్బింగ్ మొద‌లుపెట్టాను.. 2022ను ఘ‌నంగా ప్రారంభించుదాం..’’ అని పేర్కొన్నారు. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ వంటివారు నటిస్తున్న ఈ చిత్రాన్ని 11 ఫిబ్రవరి, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల చేయనున్నారు.



Updated Date - 2022-01-01T03:11:21+05:30 IST