Aditi Rao Hydari to Sanjay Leela Bhansali.. తల్లి ఇంటిపేరుతో చెలామణి అవుతున్న బాలీవుడ్ ప్రముఖులు వీళ్లే..

ABN , First Publish Date - 2022-05-09T17:30:50+05:30 IST

సాధారణంగా మన దేశంలో ప్రతి ఒక్కరూ తన తండ్రి ఇంటిపేరును తమ ఇంటి పేరుగా మార్చుకుంటారు. అదే ఆడపిల్లలయితే..

Aditi Rao Hydari to Sanjay Leela Bhansali.. తల్లి ఇంటిపేరుతో చెలామణి అవుతున్న బాలీవుడ్ ప్రముఖులు వీళ్లే..

సాధారణంగా మన దేశంలో ప్రతి ఒక్కరూ తన తండ్రి ఇంటిపేరును తమ ఇంటి పేరుగా మార్చుకుంటారు. అదే ఆడపిల్లలయితే మొదట తండ్రి ఇంటిపేరు.. పెళ్లయ్యాక భర్త ఇంటిపేరుని తీసుకుంటారు. ఈ ధోరణి శతాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే కొందరు బాలీవుడ్ ప్రముఖులు ఈ ట్రెండ్‌ని బ్రేక్ చేసి తల్లి పేరును లేదా ఇంటిపేరును మార్చుకున్నారు. అలా తల్లి ఇంటి పేరును తమ ఇంటి పేరుగా మార్చుకున్న బీ టౌన్ సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం.


అదితి రావ్ హైదరీ (Aditi Rao Hydari)..

బాలీవుడ్‌తో పాటు తెలుగు వంటి సౌతిండియన్ సినిమా ఇండస్ట్రీల్లో నటిగా తనకంటూ గుర్తింపు పొందిన నటి అదితి రావ్ హైదరీ. ఈ బ్యూటీ తండ్రి ఇంటి పేరైన ‘రావు’ని, తల్లి ఇంటి పేరైన ‘హైదరి’ని తన ఇంటిపేరుగా మార్చుకుని అదితి రావ్ హైదరీ అయ్యింది.


మల్లికా షెరావత్ (Mallika Sherawat)..

బాలీవుడ్‌లోని బోల్డ్, గ్లామరస్ నటీమణులలో ఒకరైన మల్లికా షెరావత్ ఒకరు. ఈ భామ అసలు పేరు రీమా లాంబా. ఇందులో తండ్రి ఇంటి పేరు లాంబా. అయితే ఈ బ్యూటీ తల్లి పేరు సంతోష్ షెరావత్. కానీ.. సినిమాల్లోకి వచ్చిన ఈ వృత్తి జీవితం కోసం తన పేరును మల్లిక‌గా మార్చుకుని తల్లి ఇంటిపేరుతో కలిపి మల్లిక షెరావత్‌గా ప్రసిద్ధి చెందింది.


కొంకణా సేన్ శర్మ..

బాలీవుడ్ నటి కొంకణా సేన్ శర్మ తన ఇంటిపేరులో తల్లి, తండ్రి ఇంటి పేర్లను ఉపయోగిస్తుంది. కొంకణా తల్లి పేరు అపర్ణా సేన్, ఆమె తండ్రి పేరు ముకుల్ శర్మ. అందుకే ఆమె తన పూర్తి పేరు కొంకణా సేన్ శర్మ అయ్యింది.


సైరా బాను..

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దివంగత దిలీప్ కుమార్ భార్య సైరా బాను తన పేరుకి భర్త లేదా తండ్రి ఇంటిపేరును జోడించుకోలేదు. వాటికి బదులు తన తల్లి ఇంటిపేరును తన ఇంటిపేరుగా మార్చుకుంది. సైరా తండ్రి పేరు మియాన్ ఎహసాన్-ఉల్-హక్, ఆమె తల్లి పేరు నసీమా బానో. అందుకే ఆమె పేరు సైరా బాను అయ్యింది.


సంజయ్ లీలా భన్సాలీ..

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఇంటి పేరుగా తండ్రి పేరుకు బదులు తన తల్లి పూర్తి పేరును వాడుకుంటున్నాడు. ఆయన తల్లి పేరు లీలా భన్సాలీ.


ఇమ్రాన్ ఖాన్..

అమిర్ ఖాన్ మేనల్లుడు, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ అందరికీ గుర్తుండే ఉంటాడు. నుజత్ ఖాన్, అనిల్ పాల్ ఈ నటుడి తల్లిదండ్రులు. ఆయన తన తల్లి ఇంటిపేరైనా ఖాన్‌ని తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.

Updated Date - 2022-05-09T17:30:50+05:30 IST