ఎన్నో తప్పులు చేశాను.. అది 100 శాతం నమ్మకంగా చెప్పగలను.. కానీ.. : అదితి రావ్

ABN , First Publish Date - 2022-03-15T18:14:02+05:30 IST

బాలీవుడ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి అదితి రావ్ హైదరీ. అప్పటి నుంచి దాదాపు దశాబ్దంగా..

ఎన్నో తప్పులు చేశాను.. అది 100 శాతం నమ్మకంగా చెప్పగలను.. కానీ.. : అదితి రావ్

బాలీవుడ్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నటి అదితి రావ్ హైదరీ. అప్పటి నుంచి దాదాపు దశాబ్దంగా తెలుగు, తమిళం, మలయాళం వంటి సౌత్ భాషల్లోనూ మూవీస్ చేస్తూ కెరీర్‌లో ముందుకు దూసుకుపోతోంది. అయితే సినిమాల ఎంపికలో చాలా పొరపాట్లు ఈ భామ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.


అధితి మాట్లాడుతూ.. ‘నేను చాలా తప్పులు చేశానని 100 శాతం చెప్పగలను. అయితే కొన్నిసార్లు ఓ సినిమా చేసినప్పుడు అది అనుకున్నట్లు జరగలేదు. నేను చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఆ సమయంలో నాకు ఇక్కడ ఎటువంటి సపోర్టు లేదు. అందుకే ఏ సినిమాని ఎలా తీస్తున్నారో తెలుసుకోవడం కష్టమైంది.


నా వరకు మంచి ఉద్దేశంతోనే సినిమా చేస్తాను. కానీ చివరికి ఎలా రూపొందుతుందనేది నా చేతుల్లో లేదు. ఫలితంలో నేను కేవలం ఒక భాగం మాత్రమే కానీ పూర్తి బాధ్యత నాది కాదు కదా. అందుకే దీన్ని పొరపాటుగా భావించడం లేదు. కానీ వాటి వల్ల చాలా నేర్చుకున్నాను.


అయితే.. నేను సినిమా ఎంపిక గురించి బాధ పడడం లేదు. నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. అందుకే మంచి కథలు, పాత్రలతో అందరి మనసుల్లో స్థానం సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను’ అని చెప్పుకొచ్చింది.

Updated Date - 2022-03-15T18:14:02+05:30 IST