Macherla Niyojakavargam: సాంగ్ ‘అదిరిందే’!

ABN , First Publish Date - 2022-07-24T00:37:23+05:30 IST

నితిన్ (Nithiin), కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఈ చిత్రం ఆగస్ట్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా

Macherla Niyojakavargam: సాంగ్ ‘అదిరిందే’!

నితిన్ (Nithiin), కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఈ చిత్రం ఆగస్ట్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను యమా జోరుగా నిర్వహిస్తుంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ‘అదిరిందే’ (Adirindey) అనే లిరిక్స్‌తో సాగే ఫుల్ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్ (Mahathi Swara Sagar) ఈ పాటని ఫ్యూషన్ వెస్ట్రన్ టచ్‌తో ఫుట్ ట్యాపింగ్ నెంబర్‌గా స్వరపరిచారు. ఈ పాటలో నితిన్, కృతి శెట్టిలా కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. స్టయిలీస్ అండ్ కూల్‌గా చేసిన డ్యాన్స్ మూమెంట్స్ అలరిస్తున్నాయి. కృష్ణకాంత్ (కె.కె) (Krishna Kanth) సాహిత్యం అందించిన ఈ పాటను సంజిత్ హెగ్డే ఆలపించారు. ‘అదిరిందే.. పసిగుండె.. తగిలిందే హై వోల్టేజ్..’ అంటూ సాగిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


శ్రేష్ట్ మూవీస్  బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి (Anjali) స్పెషల్ నంబర్‌ ‘రారా రెడ్డి’లో సందడి చేయనుంది. ఐఏఎస్ అధికారి సిద్ధార్థ్ రెడ్డిగా హీరో నితిన్ నటించనున్న ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని (Samuthirakani) పవర్ ఫుల్ విలన్‌గా కనిపించనున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకుడు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.  ప్రమోషన్‌లో భాగంగా మాచర్ల దమ్కీ 26న, థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేయనున్నారు.



Updated Date - 2022-07-24T00:37:23+05:30 IST