Adipurush: ప్రమోషన్స్ మొదలయ్యేదెప్పుడంటే..

ABN , First Publish Date - 2022-06-02T14:48:10+05:30 IST

గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేస్తున్న సినిమాలు సలార్‌ (Salaar), ఆదిపురుష్‌ (Adipurush), ప్రాజెక్ట్ K (Project K). వీటిలో ఒక్కో సినిమా ఒక్కో జోనర్‌లో రూపొందుతుంటడం విశేషం.

Adipurush: ప్రమోషన్స్ మొదలయ్యేదెప్పుడంటే..

గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేస్తున్న సినిమాలు సలార్‌ (Salaar), ఆదిపురుష్‌ (Adipurush), ప్రాజెక్ట్ K (Project K). వీటిలో ఒక్కో సినిమా ఒక్కో జోనర్‌లో రూపొందుతుంటడం విశేషం. సాహో (Sahoo), రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా కూడా ప్రభాస్ క్రజ్ అండ్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్ షూటింగ్ దశలో ఉంది. శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే పతాకంపై నిర్మాత విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


అయితే, ఇప్పటికే చిత్రీకరణ పూర్తైన ఆదిపురుష్ మూవీ కోసం ఇండియాతో పాటు విదేశాలలో ఉన్న ప్రభాస్ అభిమానులు సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకున్న అప్‌డేట్స్ ఏవీ కూడా ఆదిపురుష్ (Adipurush) మూవీ నుంచి రాలేదు. దాంతో అభిమానులు చాలా డిసప్పాయింట్‌మెంట్‌తో ఉన్నారు. అయితే, తాజా సమాచారం మేరకు వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ అక్టోబర్ నుంచి మూవీ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుందట. 2023, సంక్రాంతి బరిలో ఈ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే అక్టోబర్ నుంచి భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించనున్నారట. వరుసగా మూవీ నుంచి ప్రభాస్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ వదలడానికి దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారట. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. ఆయనకు జంటగా సీత పాత్రలో కృతిసనన్ (Kritisanon), ఇతర కీలక పాత్రల్లో సైఫ్ అలీఖాన్ (Saif Alikhan), సన్నీ సింగ్ (Sunny Singh) నటించారు. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ (Om Raut) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇక సైన్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ K షూటింగ్ కూడా ఒకవైపు నుంచి జరుగుతోంది. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రానికి టికెట్ రేట్లను కూడా పెంచడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Updated Date - 2022-06-02T14:48:10+05:30 IST