Kriti Sanon: ఆ హీరోతో డేటింగ్.. ప్రభాస్‌తో పెళ్లి..

ABN , First Publish Date - 2022-11-26T21:09:49+05:30 IST

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ కృతి సనన్ (Kriti Sanon)‌. ‘వన్: నేనొక్కడినే’ తో వెండి తెరపైకి రంగప్రవేశం చేసింది.

Kriti Sanon: ఆ హీరోతో డేటింగ్.. ప్రభాస్‌తో పెళ్లి..

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ కృతి సనన్ (Kriti Sanon)‌. ‘వన్: నేనొక్కడినే’ తో వెండి తెరపైకి రంగప్రవేశం చేసింది. అనంతరం హిందీ నుంచి వరుసగా అవకాశాలు రావడంతో అక్కడే సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ ఫుల్ బిజిగా ఉంది. తాజాగా ‘తోడేలు’ (Thodelu) లో నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌ (Prabhas) గురించి అనేక సార్లు ఆమె ప్రస్తావించింది. 


పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush) లో ప్రభాస్, కృతి సనన్ కలసి పనిచేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో కలసి పనిచేయడం సంతోషంగా ఉందని పలు మార్లు కృతి సనన్ తెలిపింది. ఈ మూవీని ఒకేసారి తెలుగు, హిందీలో చిత్రీకరించారని చెప్పింది. ప్రభాస్‌కు తాను హిందీ డైలాగ్స్‌లో  సహాయం చేశానని పేర్కొంది. అదే విధంగా తెలుగు డైలాగ్స్‌లో అతడు తనకు సహాయం చేశాడని వెల్లడించింది. తోడేలు ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్ గురించి కృతి అదేపనిగా మాట్లాడుతుంటంతో ఆమెకు సంబంధించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ‘‘ప్రభాస్, టైగర్ ష్రాఫ్, కార్తిక్ ఆర్యన్ వీరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు? ఎవరిని ఫ్లర్ట్ చేస్తారు?’’ అని జర్నలిస్ట్ కృతిని అడిగింది. ‘‘కార్తిక్ ఆర్యన్‌ను ఫ్లర్ట్, టైగర్‌తో ‌డేటింగ్ చేస్తా. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా’’ అని కృతి సమాధానమిచ్చింది. ఇక ‘ఆదిపురుష్’ విషయానికొస్తే.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. టీ-సిరీస్ రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించింది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.    





Updated Date - 2022-11-26T21:09:49+05:30 IST