బాలీవుడ్‌లో ఒకరి స్నేహితులు మరొకరితో పనిచేస్తే నా లాంటి వారికి అవకాశాలెలా వస్తాయి: జరీన్ ఖాన్

ABN , First Publish Date - 2022-03-14T02:27:05+05:30 IST

‘వీర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ

బాలీవుడ్‌లో ఒకరి స్నేహితులు మరొకరితో పనిచేస్తే నా లాంటి వారికి అవకాశాలెలా వస్తాయి: జరీన్ ఖాన్

‘వీర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుందరి జరీన్ ఖాన్. అనంతరం బోల్డ్ కంటెంట్ సినిమాల్లో నటించినప్పటికీ అవి ఆమె కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. టాలీవుడ్‌లోను గోపిచంద్ పక్కన ‘చాణక్య’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా జరీన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. బాలీవుడ్‌లో నటీనటులు వారి వారి స్నేహితులతో నటిస్తుండగా.. ఆ స్నేహితులు మరొకరితో పనిచేస్తున్నారని ఆమె చెప్పింది. ఈ విధంగా చేస్తే తనలాంటి వాళ్లకు అవకాశం ఎలా లభిస్తుందని పేర్కొంది. 


సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లభించాలంటే అందరితో కలివిడిగా ఉండాలని చెప్పింది. పార్టీలకు హాజరయ్యి పరిచయం పెంచుకోవాలని పేర్కొంది. తన కెరీర్ ప్రారంభం అయినప్పుడు నెట్‌వర్క్‌ను ఏలా బిల్డ్ చేసుకోవాలో తనకు తెలియదని వెల్లడించింది. కానీ, నెట్ వర్క్ ఎంత అధికంగా ఉంటే అన్ని అవకాశాలు లభిస్తాయని వివరించింది. ‘‘నేను సినీ కుటుంబానికి చెందిన దానిని కాను. ఇండస్ట్రీలో పరిచయాలు ఏ మాత్రం లేవు. సినీ ఇండస్ట్రీలోని చాలా మంది వ్యక్తులకు నేను తెలియను. దీంతో నాకు సరైన అవకాశాలు దక్కలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లోని నటీనటులు వారి స్నేహితులతో నటిస్తుండగా, ఈ  మిత్రులు మరొకరితో పనిచేస్తున్నారు. ఈ విధంగా చేస్తే నా లాంటి వాళ్లకు అవకాశాలు ఎలా లభిస్తాయి’’ అని జరీన్ ఖాన్ చెప్పింది. 


గత కొన్నేళ్లుగా ఫిల్మ్ మేకర్స్ తన టాలెంట్‌ను గుర్తించలేదని జరీన్ ఖాన్ వాపోయింది. తనకు కొత్త రకం పాత్రలు ఇవ్వడానికి నిరాకరించారని స్పష్టం చేసింది. ‘‘వ్యక్తిగతంగా నేను ఎవరికీ తెలియదు. అందువల్ల వారికి నా టాలెంట్ గురించి అవగాహన లేదు. స్క్రీన్ మీద నేను పోషించిన పాత్రలను మాత్రమే చూశారు. ఆ పాత్రల్లోనూ నాకు సరైన అవకాశాలు రాలేదు. హాట్ పాత్రలు తప్పితే వేరేవి ఇవ్వడానికి నిరాకరించారు’’ అని జరీన్ ఖాన్ తెలిపింది.  ‘హౌస్‌‌ఫుల్-2’, ‘హేట్ స్టోరీ-3’, ‘అక్సర్-2’ వంటి తదితర చిత్రాల్లో జరీన్ నటించింది.  

Updated Date - 2022-03-14T02:27:05+05:30 IST