అరుదైన వ్యాధితో యుద్ధం చేస్తున్నానంటున్న Shruti Haasan.. ఇంతకీ ఆ డిసీజ్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-01T19:59:35+05:30 IST

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి శృతి హాసన్..

అరుదైన వ్యాధితో యుద్ధం చేస్తున్నానంటున్న Shruti Haasan.. ఇంతకీ ఆ డిసీజ్ ఏంటంటే..

తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి శృతి హాసన్ (Shruti Haasan). అనంతరం తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి అక్కడ సైతం మంచి గుర్తింపునే సాధించింది. అయితే.. కొన్నేళ్లపాటు సినీ పరిశ్రమకి దూరంగా ఉన్న నటి ఇటీవలే ప్రభాస్, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మళ్లీ కెరీర్‌లో బిజీగా మారింది.కాగా.. శృతి ఏ విషయం గురించైన ముక్కు సూటిగా మాట్లాడుతుందనే విషయం తెలిసిందే. అది ఇతరుల గురించైనా, ఆమెకున్న సమస్యల గురించైనా అలాగే ముక్కుసూటిగా ఉంటుంది. ఈ బ్యూటీ తాజాగా ఆమెకున్న PCOS అనే అరుదైన వ్యాధి గురించి, హర్మోనల్ సమస్యల గురించి సోషల్ మీడియా (Social Media) వేదికగా అందరికీ తెలియజేసింది.


శృతి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది. దానికి..‘నాతో వర్కవుట్ చేయండి. నేను నా పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్), ఎండోమెట్రియోసిస్‌ వంటి పలు హార్మోన్ సమస్యలను ఎదుర్కొంటున్నాను. దీని వల్ల అసమతుల్యత, ఉబ్బరం, జీవక్రియ వంటి పలు సవాళ్లతో కఠినమైన పోరాటం చేయాల్సి ఉంటుందని మహిళలకు తెలుసు. కానీ దానిని పోరాటంగా చూడకుండా.. దాన్ని సహజ ప్రక్రియ భావిస్తూ ముందుకు వెళుతున్నాను. సరిగ్గా తినడం, బాగా నిద్రపోవడం, నా వ్యాయామాన్ని ఆస్వాదించడం ద్వారా ఆ వ్యాధిని ఎదుర్కొంటాను. ప్రస్తుతం నా శరీరం పర్ఫెక్ట్‌గా లేదు.. కానీ నా హృదయం పరిపూర్ణంగా ఉంది. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. అలాగే ఆ ఆరోగ్యకరమైన హార్మోన్లను ప్రవహించనివ్వండి. నేను లెక్చర్ ఇస్తున్నానని నాకు తెలుసు. కానీ ఈ సవాళ్లను అంగీకరించి ఎదుర్కొటానికి ఇది చాలా ముఖ్యం’ అని రాసుకొచ్చింది. శృతి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎంతోమంది అభిమానులు ఈ భామకి సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-07-01T19:59:35+05:30 IST