ఆ చిత్రంలో ఏంజీఆర్, నాన్నగారి మధ్య కాల్పుల ఘటన కూడా ఉంటుంది: రాధికా శరత్ కుమార్

ABN , First Publish Date - 2022-04-04T23:28:52+05:30 IST

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో అభిమానులను అలరించిన నిన్నటి తరం నటి రాధికా శరత్ కుమార్. దాదాపుగా 20ఏళ్ల అనంతరం తెలుగు సినిమాల్లోకి ఆమె రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో ముచ్చటించారు.

ఆ చిత్రంలో ఏంజీఆర్, నాన్నగారి మధ్య కాల్పుల ఘటన కూడా ఉంటుంది: రాధికా శరత్ కుమార్

‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రంలో అభిమానులను అలరించిన నిన్నటి తరం నటి రాధికా శరత్ కుమార్. దాదాపుగా 20ఏళ్ల అనంతరం తెలుగు సినిమాల్లోకి ఆమె రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో ముచ్చటించారు. రాధికా నాన్న ఎం.ఆర్. రాధ జీవితం ఆధారంగా ఒక స్క్రిఫ్ట్ సిద్ధం చేస్తున్నానని చెప్పారు. అందులో ఏంజీఆర్, రాధిక తండ్రి మధ్య అప్పట్లో జరిగిన కాల్పుల ఘటన ప్రస్తావన కూడా ఉంటుందని ఆమె తెలిపారు. అయితే, ఇంతకీ... ఆ కాల్పుల వెనుక అసలు కథేంటి? రండి తెలుసుకుందాం... 


రాధికా తండ్రి ఎం.ఆర్.రాధ, ఎంజీఆర్‌ను 1967, జనవరి 12న కాల్చారు. నందంబాక్కంలోని ఎంజీఆర్ నివాసంలో సాయంత్రం 5గంటలకు ఈ ఘటన జరిగింది. దీంతో ఆయనను అత్యవసర చికిత్స కోసం రాయప్పేట ఆసుపత్రికీ తరలించారు. ఎంజీఆర్‌ను కాల్చిన అనంతరం ఎం.ఆర్.రాధ కూడా ఆత్మహత్య చేసుకోవడానికీ ప్రయత్నించారు. ఫలితంగా ఆయనను కూడా ఎంజీఆర్ చేరిన ఆసుపత్రిలోనే చేర్చారు. కాల్పుల విషయం తెలియడంతో ఎంజీఆర్ అభిమానులు భారీ ఎత్తున రాధ నివాసానికీ చేరుకుని ఆస్తులను ధ్వంసం చేశారు. సర్జరీ కోసం ఇద్దరిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు నిర్ణయించారు. 


రాయప్పేట ఆసుపత్రి వద్ద భారీ ఎత్తున ప్రజలు ఉండటంతో పోలీసులు వారిని బలవంతంగా తప్పించారు. ఇద్దరు నటులని రాత్రి 10.15గం.లకు ఒకే అంబులెన్స్‌లో మరోక ఆసుపత్రికి తరలించారు. రాధ శరీరంలోని తూటాను డాక్టర్స్ తొలగించారు. కానీ, ఎంజీఆర్‌కు తగిలిన బుల్లెట్‌ను తీసేస్తే ప్రాణాపాయం ఉండటంతో దానిని తొలగించలేదు. మరుసటి రోజు ఉదయానికి ఇద్దరి పరిస్థితి మెరుగుపడింది. ఇక ఈ కాల్పుల ఘటనలో ప్రత్యక్ష సాక్షిగా నిర్మాత కేకే.వాసు ఉన్నారు. తరువాత ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరపగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.     


రాధతో కలసి నిర్మాత కేకే.వాసు సినిమా చర్చలు జరపడానికి ఎంజీఆర్ నివాసానికి వెళ్లారు. రాధ నుంచి కొంచెం డబ్బును కేకే. వాసు అప్పుగా తీసుకున్నారు. ఆ డబ్బుతో ఎం‌జీఆర్ హీరోగా ఓ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో వడ్డీతో సహా తీసుకున్న అప్పును వాసు తిరిగి చెల్లించారు. ఎంజీఆర్‌తో మరో చిత్రాన్ని నిర్మించాలని వాసును రాధ కోరారు. మూవీకీ సంబంధించిన చర్చలు జరపడానికీ ఇద్దరూ కూడా ఎంజీఆర్ నివాసానికి వెళ్లారు. ముగ్గురు కలసి సినిమాకు సంబంధించిన చర్చలు జరపడం ప్రారంభించారు.ఆ చర్చలు అనుకోకుండా వాగ్వాదానికీ దారి తీశాయి. దీంతో రాధ ఆగ్రహానికి గురయ్యారు. అకస్మాత్తుగా లేచి నిలబడ్డారు. ఎంజీఆర్ కూర్చోవాలని ఆయనను అడిగారు. అయినా, రాధ పట్టించుకోలేదు. దీంతో ఎంజీఆర్, వాసు మాట్లాడుకోవడం ప్రారంభించారు. అదే సమయంలో ఒక్కసారిగా ఎంజీఆర్‌ను రాధ షూట్ చేశారు. 


‘‘తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్‌ను చంపడానికి కుట్ర చేస్తున్నానని మీరు మీడియాకు చెబుతున్నారు. నన్ను చంపుతానని భయపెడుతున్నారు’’అని ఎం‌జీఆర్, రాధపై ఆరోపణాలు గుప్పించారు. కానీ, ఈ ఆరోపణాలను రాధ తోసిపుచ్చారు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరుగుతున్నప్పుడు ఎమ్‌జీఆరే తనని కాల్చారని ఎమ్.రాధ. తెలిపారు. ఎమ్‌జీఆర్ తనని కాల్చడంతో ఆయన చేతి నుంచి గన్‌ను తీసుకుని, తిరిగి కాల్చానని రాధ చెప్పారు. చూడాలి మరి, రాధిక తీయబోయే చిత్రంలో తన తండ్రి, ఎంజీఆర్ మధ్య జరిగిన కాల్పుల ఉదంతం వెండితెర మీద ఎలా ఉండబోతోందో...



Updated Date - 2022-04-04T23:28:52+05:30 IST