మొదటిసారి కూతురి గురించి మాట్లాడిన Priyanka Chopra.. అవన్నీ నమ్మనంటూ..

ABN , First Publish Date - 2022-04-14T19:37:15+05:30 IST

బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ప్రియాంక చోప్రా. తర్వాత ఈ భామ ‘క్వాంటికో’ టీవీ షోతో..

మొదటిసారి కూతురి గురించి మాట్లాడిన Priyanka Chopra.. అవన్నీ నమ్మనంటూ..

బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నటి ప్రియాంక చోప్రా. తర్వాత ఈ భామ ‘క్వాంటికో’ టీవీ షోతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అనంతరం నటుడు, సింగర్, తనకంటే పదేళ్లు చిన్నవాడైనా నిక్ జోనాస్‌ను కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంట ఇటీవలే సరోగసీ ద్వారా ఓ బిడ్డను పొందారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన ప్రియాంక ఆ తర్వాత కూతురి గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ.. తాజాగా కూతురి పెంపకం గురించి ఓ ఇంటర్వ్యూలో ఈ భామ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.


ప్రియాంక మాట్లాడుతూ.. ‘నేను కొత్తగా తల్లినయ్యాను. అందరిలాగే పాప పెంపకం విషయంలో నాకు కొన్ని భయాలు ఉన్నాయి. కానీ.. నా కోరికలు, భయాలను నా కూతురిపై రుద్దకూడదని మాత్రం గట్టిగా అనుకుంటున్నాను. పిల్లలు మీ ద్వారా వస్తారు.. కానీ.. మీనుంచి కాదు. అందుకే వాళ్లని అన్నింట్లో కంట్రోల్ చేయాలనే విషయాన్ని నేను నమ్మను. జీవితం గురించి తెలుసుకోవడానికి, దాన్ని నిర్మించుకోవడానికి వారికి మీరు ఒక వాహకం మాత్రమే. అది నాకెంతో ఉపయోగపడింది. ఎందుకంటే నా తల్లిదండ్రుల అదే రీతిలో నన్ను పెంచారు’ అని చెప్పుకొచ్చింది.


అలాగే ఇటీవలే జరిగిన మరో ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. ‘కూతురి ఏ పేరు పెట్టాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తన పేరుకి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని నేను, నిక్ కోరుకుంటున్నాం. ఇప్పటి వరకూ అలాంటి పేరు మాకు దొరకలేదు. మా హృదయానికి హత్తుకునేలా ఉండే పేరుని త్వరలోనే పాపకి పెడతాం’ అని తెలిపింది.

Updated Date - 2022-04-14T19:37:15+05:30 IST