నాగిని డ్యాన్స్‌తో రచ్చ రేపిన నటి ప్రగతి.. వీడియో వైరల్

ABN , First Publish Date - 2021-12-16T04:17:23+05:30 IST

రీసెంట్‌గా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో స్టేజ్‌పై మెగాస్టార్ చిరంజీవి ‘అత్తో అత్తమ్మ కూతురో..’ పాటకు డ్యాన్స్ చేసి మెస్మరైజ్ చేసిన ప్రగతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్‌లో నాగిని పాటకు అదిరిపోయేలా స్టెప్పులు వేసి మరోసారి హాట్ టాపిక్‌కు

నాగిని డ్యాన్స్‌తో రచ్చ రేపిన నటి ప్రగతి.. వీడియో వైరల్

నటి ప్రగతి ఏం చేసినా ఇప్పుడు సంచలనం అవుతుంది. ఆ మధ్య వర్కవుట్స్ చేస్తూ తరచూ వీడియోలను, ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసిన ప్రగతి.. ఈ మధ్య ఎక్కువగా డ్యాన్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తుంది. రీసెంట్‌గా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో స్టేజ్‌పై మెగాస్టార్ చిరంజీవి ‘అత్తో అత్తమ్మ కూతురో..’ పాటకు డ్యాన్స్ చేసి మెస్మరైజ్ చేసిన ప్రగతి.. తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్‌లో నాగిని పాటకు అదిరిపోయేలా స్టెప్పులు వేసి మరోసారి హాట్ టాపిక్‌కు కారణమైంది. 


నటనలోనే కాదు డ్యాన్స్ లోనూ తనకి ప్రావీణ్యం ఉందని సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్న ప్రగతి.. ఇలా డ్యాన్సులు చేస్తూ పెడుతున్న వీడియోలు వైరల్ అవుతూ.. కుర్రకారుకి మతిపోగొడుతున్నాయి. ఇరగదీసే స్టెప్పులే కాకుండా.. ఆమె వేసుకునే డ్రస్సులు కూడా హాట్ హాట్ చర్చలకు తావిస్తుండటం విశేషం. రీసెంట్‌గా పెట్టిన ఓ వీడియోలో క్లీవేజ్ షో‌తో ఆమె చేసిన ర్యాంప్ వ్యాక్ వీడియో ఎలా వైరల్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అదే స్థాయిలో ఇప్పుడు ప్రగతి చేసిన నాగిని డ్యాన్స్ వీడియో.. సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది.     



Updated Date - 2021-12-16T04:17:23+05:30 IST