Vidyasagar చనిపోయాక వైరల్‌గా మారిన Meena పాత పోస్ట్.. సరిగ్గా ఏడాది క్రితం భర్త గురించి ఆమె ఏమన్నదంటే..

ABN , First Publish Date - 2022-07-02T23:03:35+05:30 IST

పలు భాషలకు చెందిన సినిమాల్లో నటించి ఫేమ్ సంపాదించుకున్న నటి మీనా (Meena). ఆమె భర్త తాజాగా మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ జూన్ 29న మృతి చెందారు. తాజాగా

Vidyasagar చనిపోయాక వైరల్‌గా మారిన Meena పాత పోస్ట్.. సరిగ్గా ఏడాది క్రితం భర్త గురించి ఆమె ఏమన్నదంటే..

పలు భాషలకు చెందిన సినిమాల్లో నటించి ఫేమ్ సంపాదించుకున్న నటి మీనా (Meena). ఆమె భర్త తాజాగా మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ జూన్ 29న మృతి చెందారు. గతంలో మీనా పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది. రిసెప్షన్ అప్పటి ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఆ ఫొటో కింద మీనా క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘‘నా జీవితంలోకి ఇంద్రధనస్సులా వచ్చి రంగుల మయంగా మార్చావు. నీతో గడిపే ప్రతి క్షణాన్ని మధురంగా మిగిల్చావు. ఎల్లప్పుడు నువ్విచ్చిన నవ్వు నావెంటే ఉంటుంది. నా భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు’’ అని మీనా కామెంట్ చేశారు. జులైలో ఈ జంట పెళ్లి రోజు కావడంతో ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


మీనా భర్త విద్యా సాగర్ (Vidyasagar)మరణంపై పలు పత్రికలు, వెబ్‌సైట్స్‌లో అనేక పుకార్లు, షికార్లు కొడుతున్నాయి. ఆమె ఇంటికి సమీపంలో ఎక్కువ సంఖ్యలో పావురాలు ఉన్నాయని.. వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లనే విద్యా సాగర్‌కు శ్వాసకోశ సమస్యలు తలెత్తాయని కథనాలు వెలువడ్డాయి. విద్యాసాగర్ కరోనా కారణంగాను ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయనకు ఊపిరితిత్తులు మర్చాల్సి ఉండగా ఎంత ప్రయత్నించినా దాతలు దొరకలేదని ఇటీవల మీనా స్నేహితురాలు కళా మాస్టర్ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఆమె జులై 1న ఇన్‌స్టాగ్రామ్‌లో  ఓ పోస్ట్ పెట్టారు. ‘‘పరిస్థితిని అర్థం చేసుకుని మీడియా సంయమనం పాటించాలి. మాకు గోప్యతనివ్వాలి. నా భర్త మృతి విషయంలో ఎటుంటి అసత్యాలు ప్రచారం చేయవద్దు. ఇటువంటి ఇబ్బందికర సమయంలో సహృదయంతో మా కుటుంబానికీ అండగా నిలిచిన వారికీ కృతజ్ఞతలు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు’’ అని ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. 


Updated Date - 2022-07-02T23:03:35+05:30 IST