తెర మీద ‘ముద్దు’మురిపాలకు అభ్యంతరం లేదు... నా భర్తకు కూడా ఓకే!

ABN , First Publish Date - 2021-11-25T17:41:33+05:30 IST

మాజీ బ్యూటీ క్వీన్ లారా దత్తా ఓటీటీలో సందడి చేయబోతోంది. కాస్త హాట్ కంటెంట్‌తోనే ఎంటర్టైన్ చేయనుంది బోల్డ్ బేబీ. ‘హికప్స్ అండ్ హుకప్స్’ పేరుతో దర్శకుడు కునాల్ కోహ్లీ ఈ వెబ్ సిరీస్ రూపొందించాడు. టైటిల్ వినగానే కథ ఎలా ఉంటుందో అర్థమవుతోంది కదా? అందుకే, తెరపై తన ముద్దుమురిపాల గురించి కొంచెం వివరణ ఇచ్చింది మిసెస్ మహేశ్ భూపతి!

తెర మీద ‘ముద్దు’మురిపాలకు అభ్యంతరం లేదు... నా భర్తకు కూడా ఓకే!

మాజీ బ్యూటీ క్వీన్ లారా దత్తా ఓటీటీలో సందడి చేయబోతోంది. కాస్త హాట్ కంటెంట్‌తోనే ఎంటర్టైన్ చేయనుంది బోల్డ్ బేబీ. ‘హికప్స్ అండ్ హుకప్స్’ పేరుతో దర్శకుడు కునాల్ కోహ్లీ ఈ వెబ్ సిరీస్ రూపొందించాడు. టైటిల్ వినగానే కథ ఎలా ఉంటుందో అర్థమవుతోంది కదా? అందుకే, తెరపై తన ముద్దుమురిపాల గురించి కొంచెం వివరణ ఇచ్చింది మిసెస్ మహేశ్ భూపతి! 


లారా దత్తాకి తెర మీద ముద్దులు, పడకగది సన్నివేశాలు కొత్తేం కాదు. గతంలోనూ ఆమె కొన్ని సినిమాల్లో సెగలు రేపింది. అయితే, తాజా వెబ్ సిరీస్‌లో తన ఇంటిమేట్ సీన్స్ గురించి ముందుగానే ఇంటాయనతో చర్చించిందట! లారా దత్తా 2011లో టెన్నిస్ ఛాంపియన్ మహేశ్ భూపతిని పెళ్లాడింది...


ఒక నటిగా, తెర మీద అన్ని రకాల పాత్రలూ చేయాల్సి వస్తుందని, తనకు తెలుసంటోంది లారా. అదే విషయం భర్తకి కూడా చెప్పానని ఆమె ఓ ఇంటర్వ్యూలో వివరించింది. కెమెరా ముందు చేసే రొమాన్స్ ‘టెక్నికల్’గా సాగుతుందనీ, ఫైట్సు, డ్యాన్సు కొరియోగ్రాఫ్ చేసినట్టుగానే ముద్దులు కూడా ‘ప్లాన్’ చేసి, అమలు చేస్తారని లారా అంటోంది. తమ వెబ్ సిరీస్‌లో శృంగార సన్నివేశాలు కాస్త ఘాటుగా ఉంటాయి తప్ప అసభ్యంగా ఉండవని ఆమె పేర్కొంది. అందుకే, లారా భర్త మహేశ్ భూపతి కూడా ఆన్‌స్క్రీన్ కిస్సింగ్, రొమాన్స్‌కి అభ్యంతరం చెప్పాలేదట...      

Updated Date - 2021-11-25T17:41:33+05:30 IST