Kangana Ranaut: అటువంటి పరిస్థితుల్లో కూడా.. అవిమాత్రం చేయలేదు

ABN , First Publish Date - 2022-05-22T16:15:27+05:30 IST

మనసులో మాటని ఎటువంటి మొహమాటం, దాపరికం లేకుండా బయటపెట్టే నటి కంగనా రనౌత్. అయితే..

Kangana Ranaut: అటువంటి పరిస్థితుల్లో కూడా.. అవిమాత్రం చేయలేదు

మనసులో మాటని ఎటువంటి మొహమాటం, దాపరికం లేకుండా బయటపెట్టే నటి కంగనా రనౌత్. అయితే.. ఈ భామ అలా మాట్లాడిన మాటలు కొన్నిసార్లు కాంట్రవర్సీకి కారణమవుతుంటాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తాజాగా నటించిన చిత్రం ‘ధాకడ్ (Dhaakad)’. మే 20న విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. రజనీష్ గాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఈ తార ఏజెంట్ అగ్ని అనే పాత్రలో నటించింది.కాగా.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.


కంగన మాట్లాడుతూ.. ‘నేను ఎంతో కష్టపడి ఈ ప్లేస్‌కి వచ్చాను. దీనికోసం దాదాపు 10 సంవత్సరాలు ఎంతో హార్డ్ వర్క్ చేశాను. అయితే ఈ జర్నీలో ఎప్పుడూ ఒకే మాటమీద ఉన్నాను. అంటే దీని అర్థం.. ఈ ప్రయాణంలో నేను ఎటువంటి కష్టాలు పడలేదని కాదు. కెరీర్ కోసం ఎంతో స్ట్రగుల్ అయ్యాను. కానీ.. నేనెప్పుడూ ఎలాంటి ఐటెమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ చేయలేదు. అలాగే.. ఫెయిర్‌నెస్ క్రీమ్‌ (Endorsing fairness creams)లు వంటి అందానికి సంబంధించిన ప్రకటనల్లో నటించలేదు. అందుకే ఇప్పుడు కూడా కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు’ అని చెప్పుకొచ్చింది.


కంగన ఇంకా మాట్లాడుతూ.. ‘నా గతాన్ని ఒకసారి పరిశీలిస్తే మీకు ఎటువంటి వివాదాలు కనిపించవు. దీని కోసం దాదాపు 20 సంవత్సరాలు ఏ విషయంలో స్పందించకుండా ఎంతో మౌనంగా ఉన్నాను. అలాంటి విషయాల మీద నా ఎనర్జీని వృథా చేసుకోవాలని అనుకోలేదు. అయితే.. నాకంటూ ఓ స్థాయి వచ్చిన తర్వాత అన్నింటి మీద ఓ స్టాండ్ తీసుకోవడం ప్రారంభించాను’ అంటూ ఎంతో ముక్కుసూటిగా తెలిపింది.

Updated Date - 2022-05-22T16:15:27+05:30 IST