దీపికాని ఎవరైనా ప్రేమిస్తారంటున్న అభిషేక్ బచ్చన్.. నటి రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-03-24T18:56:06+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసి తనకంటూ గుర్తింపు పొందిన నటుడు అభిషేక్ బచ్చన్...

దీపికాని ఎవరైనా ప్రేమిస్తారంటున్న అభిషేక్ బచ్చన్.. నటి రియాక్షన్ ఏంటంటే..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసి తనకంటూ గుర్తింపు పొందిన నటుడు అభిషేక్ బచ్చన్. గత కొన్నేళ్లుగా సినిమాల విషయంలో కొంచెం నెమ్మదించిన ఈ నటుడు ఇటీవలే మళ్లీ స్పీడు పెంచాడు. గత కొన్ని నెలల క్రితమే ‘బాబ్ బిశ్వాస్’తో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ నటుడు తాజాగా నటిస్తున్న చిత్రం ‘దస్వీ’.


నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ని చిత్రబృందం ఇటీవలే విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అందులో.. ఓ సీన్‌లో భాగంగా ‘దీపికాని ఎవరైనా ప్రేమిస్తారు’ అంటూ అభిషేక్ డైలాగ్‌ చెబుతాడు. దీనిపై దీపికా తాజాగా సోషల్ మీడియాలో స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీలో.. ‘నా మీద ఉన్న ప్రేమకి దస్వీ చిత్రబృందానికి ధన్యవాదాలు. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’ అంటూ దీపికా రాసుకొచ్చింది.



Updated Date - 2022-03-24T18:56:06+05:30 IST