Cannes Film Festival 2022: ఆ జీరాఫీలతో పోటీ పడలేనంటున్న అదితి రావ్ హైదరీ

ABN , First Publish Date - 2022-05-22T20:19:10+05:30 IST

మలయాళ సినిమాతో సినీ ప్రపంచానికి పరిచయమై.. అనంతరం తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో గుర్తింపు పొందిన...

Cannes Film Festival 2022: ఆ జీరాఫీలతో పోటీ పడలేనంటున్న అదితి రావ్ హైదరీ

మలయాళ సినిమాతో సినీ ప్రపంచానికి పరిచయమై.. అనంతరం తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో గుర్తింపు పొందిన నటి అదితీ రావ్ హైదరీ. తాజాగా ఈ భామ ఐశ్వరా రాయ్, దీపికా పదుకొనే, పూజా హెగ్డే, ఆర్ మాధవన్, నవాజుద్ధీన్ సిద్ధిఖీ వంటి నటీనటులతో కలిసి భారత సినీ పరిశ్రమ తరుఫున ప్రముఖ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో పాల్గొంది. ఇందులో భాగంగా ఐదో రోజు రెడ్ కార్పెట్‌పై నడిచింది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అదితీ పలు ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకుంది.


కెన్స్ రెడ్ కార్పెట్‌కి డ్రెస్ సెలక్షన్ కోసం ఎంతో స్ట్రగుల్ అయ్యానని అదితీ చెప్పుకొచ్చింది. దీని కోసం ప్రముఖ డిజైనర్ సబ్యసాచీ డిజైన్ చేసిన రెడ్ అండ్ పింక్ గౌన్‌లో అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముందు అదితీ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను చాలా పొట్టిగా ఉన్నాను. అందుకే నేను కేన్స్ ఫెస్టివల్‌లో ఉన్న జిరాఫీలతో పోటీపడలేనని మాటల సందర్భంలో సబ్యతో చెప్పను. నేను నటిని. పొట్టిగా ఉన్నప్పటికీ నాకు బాధ లేదు. అందుకే నేను నాలాగా ఉండటానికి ఎంతో కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాను. అందుకే ధైర్యం చేసి కార్యక్రమంలో పాల్గొంటాను’ అని చెప్పుకొచ్చింది. ఇక్కడ జిరాఫీ అనే పదాన్ని అందరు తనకంటే పొడవుగా ఉన్నారనే సెన్స్‌తో అదితీ వాడింది. అదితీ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను చాలా తెలివితక్కువ పనిని చేయబోతున్నాను. రెడ్ కార్పెట్‌పై నడిచే సందర్భంలో ఖచ్చితంగా ఎదో పొరపాటు చేస్తాను. ప్రజలు నాపై విమర్శలు చేస్తారు. అయినా పర్లేదు. అంతా మంచికే. దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు’ అంటూ తెలిపింది. అయితే.. అదృష్టం కొద్ది అదితీ అనుకున్నట్లు రెడ్ కార్పెట్‌లో ఎటువంటి పొరపాటు జరగలేదు.

Updated Date - 2022-05-22T20:19:10+05:30 IST