పుట్టిన రోజున ఉదయం ఐదున్నరకే షూటింగ్‌.. ఎంతో సంతోషంగా ఉందంటున్న బాలీవుడ్ యంగ్ హీరో

ABN , First Publish Date - 2022-04-24T19:40:27+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో వరుణ్ ధావన్ ఒకరు. ఈ హీరో ఈ రోజు (ఏప్రిల్ 24)న 35వ పుట్టినరోజు..

పుట్టిన రోజున ఉదయం ఐదున్నరకే షూటింగ్‌.. ఎంతో సంతోషంగా ఉందంటున్న బాలీవుడ్ యంగ్ హీరో

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న యువ నటుల్లో వరుణ్ ధావన్ ఒకరు. ఈ హీరో ఈ రోజు (ఏప్రిల్ 24)న 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. అయితే.. కరోనా పరిస్థితుల కారణంగా గత రెండు పుట్టిన రోజులకి ఇంటి వద్దే ఉండాల్సి వచ్చింది. దీంతో ఈ పుట్టిన రోజుకి ‘బవాల్’ సినిమా షూటింగ్‌లో ఉండడం ఎంతో సంతోషాన్నిచ్చిందని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.


వరుణ్ సోషల్ మీడియాలో తన పిక్‌ని షేర్ చేశాడు. అందులో.. తెల్ల చొక్కాలో ఉన్న ఈ నటుడి చుట్టూ బెలూన్స్ ఉన్నాయి. అంతేకాకుండా దీనికి.. ‘నేను స్వీట్ 16 వయస్సులో లేను. కానీ ఈ రోజు పని చేయడం చాలా సంతోషంగా ఉంది. గత 2 పుట్టినరోజులకి ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. కానీ ఈ బర్త్ డేకి ఉదయం ఐదున్నర గంటలకే షూటింగ్ కోసం సెట్‌కి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది. ‘బవాల్’ సెట్‌లోని నితేశ్ తివారికి రిపోర్ట్ చేస్తున్నాను. 2022 నాకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ ఏడాది నేను నటించిన జుగ్ జుగ్ జియో, బేడియా విడుదలకి సిద్ధమవుతున్నాయి’ అని క్యాప్షన్ సైతం రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


దీంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతోపాటు అభిమానులు సైతం వరుణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో.. హ్యాపీ బర్డ్ డే వరుణ్ ధావన్. మీ కోరికలు అన్ని నేరవేరాలని కోరుకుంటున్నాను’ అంటూ బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఈ నటుడికి విషెస్ తెలిపింది. అలాగే.. కెరీర్‌ సక్సెస్‌ఫుల్‌గా సాగాలని కోరుకుంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు.



Updated Date - 2022-04-24T19:40:27+05:30 IST