ముంబై వీధుల్లో coconut కుమార్!

ABN , First Publish Date - 2022-03-13T00:28:04+05:30 IST

సినిమా స్టార్స్‌కి సక్సెస్‌తో పాటూ బోలెడు డబ్బు, సెలబ్రిటీ స్టేటస్ కూడా వస్తాయి. కానీ, వాటితో పాటే జనంలో తిరగలేని విధంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వస్తుంది. అందుకే, చాలా మంది ప్రముఖులు అస్సలు బయటకు రారు. వచ్చినా కారు దిగరు. కానీ, తాజాగా ‘ఖిలాడీ’ ఆప్ బాలీవుడ్ అక్షయ్ రోడ్డు మీదకి వచ్చాడు. అదీ ముంబై మహానగరంలో... వీకెండ్ అయిన శనివారం వేళ!

నటి నుంచీ రచయిత్రిగా మారిన మిసెస్ అక్షయ్... ట్వింకిల్ ఖన్నా... సొషల్ మీడియాలో యాక్టివ్. రకరకాల పోస్టుల్ని షేర్ చేస్తుంటుంది ఈ గార్జియస్ బ్యూటీ. ఆమె లెటెస్ట్‌గా అక్షయ్ కుమార్ ఫోటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్స్‌తో పంచుకుంది. ‘‘శనివారం ఉదయం వేళ... ఖాళీ రోడ్లు, చిన్నపాటి షికార్లు, అనుకోకుండా ఆగటాలు...’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ, భార్య షేర్ చేసిన ఫోటోలో అక్షయ్ ఏం చేస్తున్నాడంటే... రోడ్డు పక్కన కొబ్బరిబోండాలు అమ్మే వ్యక్తి ముందు చేతిలో కోకనట్ పట్టుకుని నింపాదిగా నిల్చున్నాడు. పర్పుల్ కలర్ టీ షర్ట్, బ్లాక్ షార్ట్స్, బ్లూ క్యాప్, వైట్ స్నీకర్స్‌తో ట్రెండీగా కనిపిస్తున్నాడు. అయితే, ముఖానికి మాత్రం మాస్క్ ధరించాడు! ఇంతకీ, తన ముందున్నది బాలీవుడ్ స్టార్ అక్షయ్ అని ‘నారియల్‌వాలా’కి తెలుసంటారా? ఏమో! ఫోటోలో మాత్రం కొబ్బరిబోండాల వ్యాపారి సీరియస్‌గా తన పని తాను చేసుకుంటున్నాడు! మాస్క్ మాటున దాగిన ‘ఖిలాడి’ స్టార్‌ని గుర్తించాడో లేదో...  

Updated Date - 2022-03-13T00:28:04+05:30 IST