ఇండియా గురించి, తాజ్ మహల్ గురించి... Spider-Man ఏమన్నాడంటే...

ABN , First Publish Date - 2022-02-16T02:05:32+05:30 IST

స్పైడర్ మ్యాన్ సినిమాతో సూపర్ ఫేమస్ అయిన టామ్ హాలాండ్ ఇండియాలో కూడా బోలెడు మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు. అయితే, తనకు చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్‌ ఉన్నందుకు మురిసిపోతోన్న బ్రిటీష్ అందగాడు...

ఇండియా గురించి, తాజ్ మహల్ గురించి...  Spider-Man ఏమన్నాడంటే...

స్పైడర్ మ్యాన్ సినిమాతో సూపర్ ఫేమస్ అయిన టామ్ హాలాండ్ ఇండియాలో కూడా బోలెడు మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకున్నాడు. అయితే, తనకు చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్‌ ఉన్నందుకు మురిసిపోతోన్న బ్రిటీష్ అందగాడు... ‘‘నేను ఇండియాకి పెద్ద ఫ్యాన్‌ని’’ అంటున్నాడు. అంతే కాదు, మన దేశంపై అభిమానంతో ఉప్పొంగిపోతోన్న హాలీవుడ్ స్టార్ ఇంత వరకూ ఇక్కడికి రాలేకపోయానని విచారం వ్యక్తం చేశాడు. త్వరలోనే భారత్‌కి వస్తాను అని చెబుతూనే... ఏదో ఒక రోజు తన సినిమా షూటింగ్ కూడా ఇండియాలో జరుగుతుందని చెప్పుకొచ్చాడు!


కొన్నాళ్ల క్రితం ‘స్పైడర్ మ్యాన్’ మూవీతో భారీ కలెక్షన్లు కొల్లగొట్టాడు టామ్ హాలాండ్. అదే ఉత్సాహంతో మరోసారి ఇండియన్ మార్కెట్‌పై కన్నేశాడు. తాజాగా ‘అన్‌చార్టెడ్’ అనే సినిమాతో భారత బాక్సాఫీస్ వద్దకి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఐ యామ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇండియా’ అంటూ అభిమానం చాటుకున్నాడు. ఇక్కడి తన అభిమానులకి కృతజ్ఞతలు కూడా తెలిపాడు. తనకు లభించిన ప్రేమ, మద్దతుకి ఎప్పటికీ ఋణపడి ఉంటానని టామ్ అన్నాడు. అయితే, వీలైనంత త్వరగా ఇండియాకి వస్తానని ఫ్యాన్స్‌కి తెలిపిన సూపర్ హీరో... మన సూపర్ బ్యూటిఫుల్ తాజ్ మహల్ కూడా సందర్శిస్తానని ప్రకటించాడు! 

Updated Date - 2022-02-16T02:05:32+05:30 IST