Parota Suri: నటుడు సూరి హోటళ్లపై సేల్స్‌టాక్స్‌ దాడులు

ABN , First Publish Date - 2022-09-22T14:10:55+05:30 IST

మదురై తమిళ సినీ హాస్యనటుడు పరోటా సూరి(Parota Suri) నడుపుతున్న‘అమ్మన్‌’ హోటల్‌లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు

Parota Suri: నటుడు సూరి హోటళ్లపై సేల్స్‌టాక్స్‌ దాడులు

- బిల్లుల్లో జీఎస్టీ నమోదు చేయని సిబ్బంది 

- 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు


చెన్నై, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మదురై తమిళ సినీ హాస్యనటుడు పరోటా సూరి(Parota Suri) నడుపుతున్న‘అమ్మన్‌’ హోటల్‌లో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మదురైలో తెప్పకుళం, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతం, ఒత్తకడై, మీనాక్షిపురం తదితర ప్రాంతాల్లో హోటళ్లను నడుపుతున్నారు. ఈ హోటళ్లలో జీఎస్టీ లేకుండా ఆహార వస్తువులను విక్రయిస్తున్నారని, సరకుల కొనుగోళ్ళకు సంబంధించి బిల్లులేకుండా లెక్కలు రాస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం తెప్పకుళం ప్రాంతంలో సూరి నడుపుతున్న ‘అమ్మన్‌’ రెస్టారెంట్‌లో వాణిజ్య పన్నుల శాఖ అధికారి సెంథిల్‌(Senthil) నాయకత్వంలో ఐదుగురు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కస్టమర్లకు బిల్లులలో జీఎస్టీ విధించడం లేదని తెలుసుకున్నారు. ఇదే విధంగా సూరికి చెందిన అన్ని హోటళ్లలోని తనిఖీలు జరిగాయి.15 రోజులలోపున తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ హోటల్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

Updated Date - 2022-09-22T14:10:55+05:30 IST