అవును.. నెపోటిజం వల్లే ఇక్కడ ఉన్నా.. Suniel Shetty కుమారుడు Ahan Shetty షాకింగ్ కామెంట్స్

ABN , First Publish Date - 2022-06-14T17:52:30+05:30 IST

బాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో మంచి పాపులారిటీ ఉన్న నటుడు సునీల్ శెట్టి. ఈయన తనయుడు అహాన్ శెట్టి సైతం..

అవును.. నెపోటిజం వల్లే ఇక్కడ ఉన్నా.. Suniel Shetty కుమారుడు Ahan Shetty షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్‌తోపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో మంచి పాపులారిటీ ఉన్న నటుడు సునీల్ శెట్టి. ఈయన తనయుడు అహాన్ శెట్టి సైతం ఇటీవలే ‘తడప్’ మూవీతో బాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఆర్ఎక్స్ 100’కి రిమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఆ సినిమా మంచి హిట్ సాధించడంతో ఈ యువ నటుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. అంతేకాకుండా ఇటీవల జరిగిన ఐఫా (IIFA) 2022లో ఈ సినిమాకి గానూ బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డుని గెలుచుకున్నాడు. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చిత్ర పరిశ్రమలోని నెపోటిజంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.


‘బంధుప్రీతి (Nepotism) విషయానికి వస్తే, నేను దానిని అంగీకరిస్తున్నాను. అవును.. నేను నెపోటిజం వల్లే ఇక్కడ ఉన్నాను. మా నాన్న ఒక నటుడు. అందుకే నేను నటుడిని కావాలనుకున్నాను. నాకు చాలా సులువుగా అవకాశాలు వచ్చాయి. నేను దానిని అస్సలు తిరస్కరించడం లేదు. కానీ.. ఇక్కడ అందరం ఒక విషయం గుర్తుంచుకోవాలి. కెరీర్‌లో సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే. అందులో ఎటువంటి మినహాయింపులు ఉండవు. చిత్ర పరిశ్రమలో నిలబడాలంటే ఇతర రంగాల కంటే చాలా ఎక్కువ కష్టపడాలి. అయితే.. ఇలాంటి పరిశ్రమలో భాగమైనందుకు నేను చాలా సంతోషం ఉన్నాను. అలాగే.. గౌరవంగా కూడా ఫీల్ అవుతున్నాను. నెపోటిజాన్ని ఉపయోగించుకోవాలని నేను అనుకోవట్లేదు. నన్ను నేను అదుపులో ఉంచుకొని, కష్టపడి పని చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-06-14T17:52:30+05:30 IST