హిందీలో వరస్ట్ సినిమాలను చేయకుండా సౌత్ ఇండస్ట్రీయే నన్ను కాపాడుతోంది.. Sonu Sood తాజా కామెంట్స్

ABN , First Publish Date - 2022-05-28T22:36:04+05:30 IST

సినిమాలు చేయడంతో పాటు కొవిడ్ సమయంలో సేవా కార్యక్రమాలతో ప్రజల ఆదరణ పొందిన నటుడు సోనూ సూద్(Sonu Sood). ఈ మధ్యనే ‘ఆచార్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. తాజాగా

హిందీలో వరస్ట్ సినిమాలను చేయకుండా సౌత్ ఇండస్ట్రీయే నన్ను కాపాడుతోంది.. Sonu Sood తాజా కామెంట్స్

సినిమాలు చేయడంతో పాటు కొవిడ్ సమయంలో సేవా కార్యక్రమాలతో ప్రజల ఆదరణ పొందిన నటుడు సోనూ సూద్(Sonu Sood). ఈ మధ్యనే ‘ఆచార్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. తాజాగా అతడు నటించిన సినిమా ‘సామాట్ర్ పృథ్వీరాజ్’(samrat prithviraj). ఈ చిత్రంలో చాంద్ బర్దాయి (Chand Bardai)గా కనిపించనున్నాడు. పృథ్వీరాజ్ విడుదల తేదీ దగ్గరపడటంతో సోనూ సూద్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 


సోనూ సూద్ మొదట్లో ముంబై వచ్చినప్పుడు పాజిటివ్ రోల్స్ మాత్రమే చేయాలనుకునేవాడట. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లెకపోవడంతో అందరు నెగెటివ్ రోల్స్ ఆఫర్ చేసేవారట. కానీ, నటుడిగా మారితే ఏ పాత్ర పోషించడానికైనా సిద్దంగా ఉండాలని తెలిపాడు. కొంతకాలానికి ఆ విషయం అర్థమైందని వివరించాడు. ‘‘ఏ ఇండస్ట్రీ అయిన సరే నేను స్క్రిఫ్ట్‌ల ఎంపికలో జాగ్రత్త వహిస్తాను. హిందీలో వరస్ట్ సినిమాలు చేయకుండా సౌత్ ఇండస్ట్రీయే నన్ను కాపాడుతోంది. అయితే.. నేను హిందీతో పాటు సౌత్‌లోను అనేక సినిమాల్లో నటించాను. ఒకానోక సమయంలో నేను బాలీవుడ్‌ను వదిలివేసి దక్షిణాది చిత్రాలు మాత్రమే చేశాను. అప్పట్లో అందరు నన్ను సౌత్‌లో ఎందుకు సినిమాలు చేస్తున్నావని ప్రశ్నించేవారు. అనుభవం కోసం చేస్తున్నాననేవాడిని. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడైనా ఒక్కటే. ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. బాలీవుడ్‌తో సహా దక్షిణాది ఇండస్ట్రీ అయిన సరే సినిమా బాగా లేకపోతే నడవదు. ప్రజలు సినిమా బాగా ఉంటేనే ఆదరిస్తారు. ప్రస్తుతం ప్రేక్షకులకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బాగా లేకపోతే బాగున్న రెండో సినిమాను చూడటానికి వెళతారు’’ అని సోనూ సూద్ తెలిపాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సోనూ సూద్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళం, హిందీలో సినిమాలు చేస్తున్నాడు. అతడు ‘తమిళరసన్’, ‘ఫతే’ చిత్రాల్లో కనిపించనున్నాడు. 

Updated Date - 2022-05-28T22:36:04+05:30 IST