అబ్దుల్ కలామ్, భగత్ సింగ్, విక్రమ్ బాత్రా... Sonu Sood !

ABN , First Publish Date - 2021-11-11T20:54:50+05:30 IST

కరోనా కాలంలో సూపర్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న రియల్ హీరో సోనూ సూద్ తాజాగా ఓ వీడియో షేర్ చేశాడు. ‘మై అవార్డ్’ అంటూ దానికి ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇంతకీ, వీడియోలో ఏముందంటే...

అబ్దుల్ కలామ్, భగత్ సింగ్, విక్రమ్ బాత్రా... Sonu Sood !

కరోనా కాలంలో సూపర్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న రియల్ హీరో సోనూ సూద్ తాజాగా ఓ వీడియో షేర్ చేశాడు. ‘మై అవార్డ్’ అంటూ దానికి ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇంతకీ, వీడియోలో ఏముందంటే... 


సోనూ సూద్ తన సొషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన లెటెస్ట్ వీడియో, ఓ ఫ్యాన్ అప్‌లోడ్ చేసింది. సోనూకి వీరాభిమాని అయిన తను... ఆయన చేస్తోన్న సోషల్ సర్వీస్ చూసి ప్రేరణ పొందాడు. అందుకే, తన అభిమాన నటుడికి అబ్దుల్ కలామ్, భగత్ సింగ్, విక్రమ్ బాత్రా వంటి మహనీయుల సరసన చోటిచ్చాడు! వారు ముగ్గురితో పాటూ సోనూ సూద్ చిత్రాన్ని కూడా ఒకే ఫ్రేమ్‌లో చిత్రించాడు! 


గత జూన్‌లో సోనూ సూద్ మరో అభిమాని... అతడి చిత్రాన్ని రక్తంతో గీశాడు! దానికి బదులిస్తూ బాలీవుడ్ యాక్టర్ ‘రక్తంతో బొమ్మలు గీయకండి... ’ అని సూచించాడు. పోయిన సంవత్సరం కరోనా లాక్‌డౌన్ వేళ మొదటి సారి సోనూ పేరు మీడియాలో, సోషల్ మీడియాలో మార్మోగింది. అతను వందలాది మంది వలస కార్మికుల్ని స్వంత ఖర్చుతో స్వగ్రామాలకు చేర్చటం, ఎందరి నుంచో, అభిమానాన్ని చూరగొంది. తరువాత కూడా పదే పదే సోనూ సూద్ సేవా కార్యక్రమాలు వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే, అదే స్థాయిలో ఆయన చుట్టూ రాజకీయాలు కూడా ముసురుకుంటున్నాయి. ఆ మధ్య ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు కలకలం రేపాయి...

Updated Date - 2021-11-11T20:54:50+05:30 IST