SAIF : ఆ విషయంలో కుర్రాళ్ల కంటే AMITABH బెటర్

ABN , First Publish Date - 2021-11-21T21:38:19+05:30 IST

తాను ఇంతకు ముందు మరికొన్ని సెలబ్రిటీ గేమ్ షోస్ లో కూడా పాల్గొన్నట్లు చెప్పిన బాలీవుడ్ సీనియర్ యాక్టర్, అమిత్ జీ స్థాయిలో మరెవర్నీ, చూడలేదని చెప్పాడ...

SAIF : ఆ విషయంలో కుర్రాళ్ల కంటే AMITABH బెటర్

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో అమితాబ్ బచ్చన్ మాట్లాడే హిందీ భాష అద్భుతం అంటూ సైఫ్ అలీఖాన్ పొగడ్తలు కురిపించాడు. ఆయన ప్రసంగించే విధానం బిగ్ బిని లెజెండ్‌గా నిలబెడుతుందని సైఫ్ అన్నాడు. అంతే కాదు, తాను ఇంతకు ముందు మరికొన్ని సెలబ్రిటీ గేమ్ షోస్ లో కూడా పాల్గొన్నట్లు చెప్పిన బాలీవుడ్ సీనియర్ యాక్టర్, అమిత్ జీ స్థాయిలో మరెవర్నీ, చూడలేదని చెప్పాడు. ‘‘వయస్సులో ఎంతో పెద్దవాడైనప్పటికీ... అమితాబ్ బచ్చన్, చాలా మంది కుర్ర హీరోల కంటే బెటర్!’’ అంటూ బాలీవుడ్ షెహన్‌షా పై తన అభిమానం చాటుకున్నాడు చోటే నవాబ్.

సైఫ్ అలీఖాన్ ‘బంటీ ఔర్ బబ్లీ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి‘ షోలో పాల్గొన్నాడు. అయితే, ‘బంటీ ఔర్ బబ్లీ’ ఒరిజినల్ మూవీలో అమితాబ్ తనయుడు అభిషేక్ నటించాడు. అందులోనూ రాణీ ముఖర్జీ నటించింది. ఇఫ్పుడు ‘బంటీ ఔర్ బబ్లీ 2’ సీక్వెల్ మూవీలో రాణి సైఫ్‌కు జోడీగా నటించింది.

Updated Date - 2021-11-21T21:38:19+05:30 IST