నాకు పెళ్లి అయిందనిపించడం లేదు.. Alia Bhatt తో వైవాహిక జీవితం గురించి Ranbir Kapoor షాకింగ్ కామెంట్స్..!

ABN , First Publish Date - 2022-06-13T19:43:31+05:30 IST

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంట ఒకటి. దాదాపు ఐదేళ్ల డేటింగ్ తర్వాత ఏప్రిల్ 14, 2022న ఈ జంట పెళ్లి చేసుకొని...

నాకు పెళ్లి అయిందనిపించడం లేదు.. Alia Bhatt తో వైవాహిక జీవితం గురించి Ranbir Kapoor షాకింగ్ కామెంట్స్..!

బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో అలియా భట్ (Alia Bhatt), రణ్‌బీర్ కపూర్ జంట ఒకటి. దాదాపు ఐదేళ్ల డేటింగ్ తర్వాత ఏప్రిల్ 14, 2022న ఈ జంట పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ముంబైలోని రణ్‌బీర్ ఇంట్లో కేవలం 50 మంది అతిథుల మధ్యలో వీరి వివాహం జరిగింది. ఈ రియల్ జంట మొదటిసారి కలిసి రీల్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర (Brahmastra)’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ తరుణంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ వివాహ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) మాట్లాడుతూ.. ‘పెళ్లి తర్వాత జీవితంలో పెద్ద మార్పు ఏమీ లేదు.. ఐదేళ్లుగా కలిసి ఉన్నాం.. పెళ్లైతే చేసుకుందామనుకున్నాం.. అయితే కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి.. అందుకే పెళ్లయిన మరుసటి రోజే మేమిద్దరం షూటింగ్‌కి వెళ్లిపోయాం.. ఆమె లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా శంషేరా విడుదల కాగానే, ఒక వారం సెలవు తీసుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. మాకు పెళ్లయిందని ఇప్పటికీ నాకు నమ్మకం కుదరడం లేదు’ అని చెప్పుకొచ్చాడు.


అంతేకాకుండా.. అలియా ప్రస్తుతం హాలీవుడ్‌ (Hollywood)లో ఓ సినిమా చేస్తోంది. దీని గురించి రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘నాకు హాలీవుడ్ గురించి కలలు లేవు. కేవలం నాకు బ్రహ్మాస్త్ర గురించి కలలు మాత్రమే ఉన్నాయి. మీ సంస్కృతిలో ఉన్న ఒరిజినల్ కంటెంట్, అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందని నా అభిప్రాయం. అది ప్రతి ప్రేక్షకుడిని టచ్ చేస్తుందని భావిస్తున్నాను. అంతేకాకుండా.. నాకు ఆడిషన్స్ అంటే చాలా భయం. అలియా సాధించిన విజయాలని కానీ, కలలను మరెవరిలో చూడలేదు. అయితే నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను’ అని తెలిపాడు. కాగా.. దర్శకుడు అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ని మూడు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ని త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

Updated Date - 2022-06-13T19:43:31+05:30 IST