రూటు మార్చిన రాజా

ABN , First Publish Date - 2021-11-14T01:35:34+05:30 IST

మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదనే నటులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అందులో మొదటి వరసలో ఉండే వారిలో రాజా రవీంద్ర ఒకరు. ఆయన ఏ పాత్ర చేసినా.. ఆ పాత్రకు ప్రాణం పెట్టేస్తారు. ఇప్పటి వరకు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. అనేక వైవిధ్య భరితమైన

రూటు మార్చిన రాజా

మాకు సినిమా తప్ప ఇంకేం తెలియదనే నటులు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అందులో మొదటి వరసలో ఉండే వారిలో రాజా రవీంద్ర ఒకరు. ఆయన ఏ పాత్ర చేసినా.. ఆ పాత్రకు ప్రాణం పెట్టేస్తారు. ఇప్పటి వరకు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. అనేక వైవిధ్య భరితమైన పాత్రలలో నటించిన రాజా రవీంద్ర.. ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తోన్న ఓ చిత్రంలో ఇంతకు ముందు ఏ సినిమాలో కనిపించని లుక్‌లో రాజా రవీంద్ర కనిపించబోతున్నారు. ఈ లుక్‌కి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


ఈ పిక్స్‌లో.. మెడలో రుద్రాక్షమాల, పంచెకట్టు, చేతికి త్రిశూలం తాట్టూ, కాలికి చేతికి కడియాలు, నోటిలో చుట్ట, ముక్కుకి రింగ్ పెట్టి.. తెల్లటి కారు మీద కూర్చుని ఉన్నారు రాజా రవీంద్ర. అసలు ఈ పిక్స్‌లో ఉంది రాజా రవీంద్రేనా అనిపించేలా ఉన్న ఈ లుక్‌లో ఆయనని చూసిన వారంతా వావ్ అంటున్నారంటే.. ఇక ఈ సినిమాలో రాజా ఎలా చెలరేగిపోయి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా అనే కాదు, కొంతకాలంగా ఆయనను గమనిస్తే.. రొటీన్‌కి భిన్నంగా రాజా రవీంద్ర రూటు మార్చాడనేది అర్థమవుతుంది. నటుడిగా ఇప్పుడాయన నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే వైవిధ్యభరిత పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తూ.. తన స్థాయి ఇదని ఇండస్ట్రీకి ఇలాంటి పాత్రలతో తెలియజేస్తున్నారు.



Updated Date - 2021-11-14T01:35:34+05:30 IST