హ్యాట్సాఫ్ టు మనోజ్.. నువ్వే కనుక ఆ రోజు లేకుంటే.. అంటూ ప్రభాకర్ ప్రశంసల వర్షం..

ABN , First Publish Date - 2021-10-12T23:44:45+05:30 IST

మా ఎన్నికల వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత కాంట్రవర్సీ తగ్గిపోయి అంతా సర్దుకుంటారని భావించారు. కానీ మంగళవారం ప్రకాశ్ రాజ్ సడన్ షాకిచ్చారు.

హ్యాట్సాఫ్ టు మనోజ్.. నువ్వే కనుక ఆ రోజు లేకుంటే.. అంటూ ప్రభాకర్ ప్రశంసల వర్షం..

మా ఎన్నికల వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత కాంట్రవర్సీ తగ్గిపోయి అంతా సర్దుకుంటారని భావించారు. కానీ మంగళవారం ప్రకాశ్ రాజ్ సడన్ షాకిచ్చారు. తన ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాము ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందన్నది ఈ సందర్భంగా సభ్యులు వివరించారు. తాము సభ్యులుగా లేకున్నా సరే, ‘మా’ సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమం చేపట్టినా తాము వస్తామనీ, సేవకులుగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు అన్ని పనులను చేస్తాడన్న నమ్మకం తమకు ఉందంటూనే.. ఒకవేళ వాళ్లకు సాధ్యం కాకపోతే తాము రంగంలోకి దిగుతామని ఈ సందర్భంగా రాజీనామా చేసిన సభ్యులు ప్రకటించారు. ఇదే సమయంలో మా ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు అసలేం జరిగిందన్నది నటుడు ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ఆ రోజు మంచు మనోజ్ లేకుంటే పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు. ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..


‘నిజంగా చెబుతున్నానండీ.. ఎలక్షన్ రోజు మాత్రం మంచు మనోజ్, మంచు విష్ణు లేకుంటే మీరు చూసిన రచ్చ ఆఫ్ట్రాల్ అయి ఉండేది. హ్యాట్సాఫ్ టు మనోజ్.. మనోజ్ లేకుంటే కొట్టుకుని చచ్చేవాళ్లు. మనోజ్ చాలా కంట్రోల్ చేశారు. చాలా చాలా సూపర్ తమ్ముడూ.. మీరెప్పుడూ చల్లగా ఉండాలి. మన పర బేధం లేకుండా ఆ రోజు చేశారు.’ అంటూ మంచు మనోజ్‌పై నటుడు ప్రభాకర్ ప్రశంసల వర్షం కురిపించారు. పదవులకు మాత్రమే తాము రాజీనామా చేస్తున్నామనీ, మా సభ్యత్వానికి కాదంటూ ఆయన తేల్చిచెప్పారు. మంచు విష్ణు సరిగ్గా పనిచేయకపోతే తాము నిలదీస్తామని ప్రభాకర్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-12T23:44:45+05:30 IST