Vikram సినిమాను చూసిన తర్వాత కార్తీ ఏమన్నాడంటే.. ప్రత్యేకంగా అన్న Surya క్యారెక్టర్ గురించి..

ABN , First Publish Date - 2022-06-07T23:20:25+05:30 IST

చాలా గ్యాప్ తర్వాత తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Hasan) నటించిన చిత్రం ‘విక్రమ్’...

Vikram సినిమాను చూసిన తర్వాత కార్తీ ఏమన్నాడంటే.. ప్రత్యేకంగా అన్న Surya క్యారెక్టర్ గురించి..

చాలా గ్యాప్ తర్వాత తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన చిత్రం ‘విక్రమ్’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మరో తమిళ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi), మలయాళీ నటుడు ఫహాద్ ఫాజిల్ ముఖ్యపాత్రలు పోషించారు. అలాగే మరో తమిళ స్టార్ హీరో సూర్య (Surya) రోలెక్స్ క్యారెక్టర్‌లో మెరిశాడు. అంతేకాకుండా ఈ మూవీలో ఓ సీన్‌లో భాగంగా లోకేశ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘ఖైదీ’లోని క్యారెక్టర్ పేరు ఢిల్లీ పేరు సినిమాలో వినిపిస్తుంది. కాగా.. తాజాగా ఈ సినిమాని చూసిన కార్తీ (Karthi) సోషల్ మీడియాలో మూవీపై స్పందించాడు.


కార్తీ చేసిన ట్వీట్‌లో.. ‘అందరూ చెప్పినట్లు విక్రమ్ సినిమా కమలహాసన్ సర్‌కి నిజమైన పండగ. ఆయన్ని ఇలా చూడడం చాలా కిక్ ఇచ్చింది. సినిమాలోని యాక్షన్, విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇతర సినిమాలతో ఆసక్తికరమైన కనెక్షన్స్‌తో ఆసక్తిని పెంచాయి. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్‌లో తన మార్క్‌ని చూపించాడు’ అని రాసుకొచ్చాడు. 


అలాగే దానికి కొనసాగింపుగా.. ‘విజయ్ సేతుపతి కొత్త అవతారంలో కనిపించారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింది. మ్యూజిక్‌‌తో బయపెట్టాడు. అదే సమయంలో రక్షకుడిగా నిలిచాడు. చివరగా.. రోలెక్స్ సర్ అయితే బాగా భయపెట్టాడు. డైరెక్టర్ లోకేశ్ మీ అభిమాన హీరో కమల్‌ని ప్రేక్షకులకి నచ్చేలా చూపించారు’ అని కార్తీ ట్వీట్ చేశాడు. కాగా.. త్వరలోనే ఖైదీ 2, సూర్య ఫుల్ లెంగ్త్ పాత్రతో ఓ సినిమా చేసేందుకు లోకేశ్ సిద్ధమవుతున్నాడు.





Updated Date - 2022-06-07T23:20:25+05:30 IST