ప్రియురాలి వెబ్ షో ‘మళ్లీ మళ్లీ చూస్తోన్న’ హృతిక్... Rumoured Girlfriend గురించి ఏమన్నాడంటే...

ABN , First Publish Date - 2022-04-23T04:03:35+05:30 IST

సొనీ లివ్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘రాకెట్ బాయ్స్’ ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్తలు హోమీ జహంగీర్ బాబా, విక్రమ్ సారాబాయ్ జీవితాలకు సంబంధించిన కథ. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్ర మన సౌత్ బ్యూటీ రెజీనా పోషించటం మరో విశేషం. కాగా, ‘రాకెట్ బాయ్స్’లో హృతిక్ ‘అప్రకటిత’ ప్రియురాలు సబా ఆజాద్ కూడా ఉంది!

ప్రియురాలి వెబ్ షో ‘మళ్లీ మళ్లీ చూస్తోన్న’ హృతిక్... Rumoured Girlfriend గురించి ఏమన్నాడంటే...

నెటిజన్స్‌ను అలరిస్తోన్న మరో ఇంట్రస్టింగ్ వెబ్ సిరీస్ ‘రాకెట్ బాయ్స్’పై బాలీవుడ్ గ్రీకు వీరుడు  హృతిక్ రోషన్ పొగడ్తల వర్షం కురిపించాడు. ‘‘మళ్లీ మళ్లీ చూస్తున్నాను! ఇందులోంచీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది... ఇండియాలోని  మన వాళ్లే, ఇటువంటిది చేశారంటే, సగ్వరంగా అనిపిస్తోంది...’’ అంటూ ‘రాకెట్ బాయ్స్’ గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. 


సొనీ లివ్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘రాకెట్ బాయ్స్’ ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్తలు హోమీ జహంగీర్ బాబా, విక్రమ్ సారాబాయ్ జీవితాలకు సంబంధించిన కథ. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్ర మన సౌత్ బ్యూటీ రెజీనా పోషించటం మరో విశేషం. కాగా, ‘రాకెట్ బాయ్స్’లో హృతిక్ ‘అప్రకటిత’ ప్రియురాలు సబా ఆజాద్ కూడా ఉంది! బీ-టౌన్ గ్రీక్ గాడ్ తనని కూడా ఓ రేంజ్‌లో మెచ్చుకున్నాడు. తాను చూసిన అత్యున్నత నటుల్లో సబా కూడా ఒకరంటూ కితాబునిచ్చాడు. ‘‘నువ్వు నాకు ప్రేరణ!’’ అంటూ హృతిక్ తన రూమర్డ్ గాళ్‌ఫ్రెండ్‌పై ప్రేమను కురిపించాడు! 

Updated Date - 2022-04-23T04:03:35+05:30 IST