Godfather: గెటప్ శ్రీను యాటిట్యూడ్ చూపిస్తున్నాడు- బ్రహ్మాజీ

ABN , First Publish Date - 2022-10-04T17:59:21+05:30 IST

సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji).. జబర్ధస్త్ కమెడియన్ గెటప్ ‌శ్రీను (Getup Srinu)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గెటప్ శీను యాటిట్యూట్ చూపిస్తున్నాడంటూ

Godfather: గెటప్ శ్రీను యాటిట్యూడ్ చూపిస్తున్నాడు- బ్రహ్మాజీ

సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji).. జబర్ధస్త్ కమెడియన్ గెటప్ ‌శ్రీను (Getup Srinu)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. గెటప్ శీను యాటిట్యూట్ చూపిస్తున్నాడంటూ బ్రహ్మాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (God Father). ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇటీవల అనంతపురంలో గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ వేడుక వర్షార్పణం కావడంతో.. మంగళవారం చిత్రయూనిట్ హైదరాబాద్‌లో అలాంటి వేడుకనే మరోసారి నిర్వహించింది. ఈ వేడుకకు చిత్రయూనిట్ అంతా హాజరైంది. ఈ కార్యక్రమంలో నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ.. గెటప్ శ్రీను‌కి యాటిట్యూట్ ఎక్కువైంది అంటూ విమర్శలు చేశాడు.


‘‘అన్నయ్య చిరంజీవి (Chiranjeevi)గారితో కలిసి ఒక్కసారి ఫ్లైట్ ఎక్కి వెళ్లినందుకే.. అన్నయ్య ఏదో తన వెంటే వచ్చినట్లుగా శ్రీను యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఈ వేడుకకి కూడా అతను వచ్చినప్పటి నుండి అన్నయ్యని అనుకరిస్తూ.. ఫోజ్ కొడుతున్నాడు..’’ అంటూ బ్రహ్మాజీ చేసిన కామెంట్స్.. ఇప్పుడంతా హాట్ టాపిక్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై చర్చలు కూడా మొదలయ్యాయి. ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో గెటప్ శ్రీను కూడా ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ముంబై వెళ్లిన టీమ్‌లో గెటప్ శ్రీను కూడా ఉన్నారు. అక్కడ సల్మాన్ ఖాన్‌ (Salman Khan)కి స్వయంగా మెగాస్టార్ చిరంజీవే గెటప్ ‌శ్రీనుని పరిచయం చేశారు. ముంబైలో జరిగిన ఆ ఈవెంట్‌కి వెళ్లివచ్చినప్పటి నుండి శ్రీనులో యాటిట్యూడ్ ఎక్కువైందనేలా ఈ స్టేజ్‌పై బ్రహ్మాజీ కామెంట్స్  చేశారు. ఆయన ఈ కామెంట్స్ చేసేటప్పుడు గెటప్ శ్రీను కూడా పక్కనే ఉన్నారు. 



Updated Date - 2022-10-04T17:59:21+05:30 IST