50 ఏళ్ల క్రితం నాటి కేసులో తీర్పు.. మైనర్‌గా ఉన్నప్పుడు లైంగికంగా వేధించాడంటూ US Comedianపై..

ABN , First Publish Date - 2022-06-22T15:32:05+05:30 IST

దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ప్లేబాయ్ మాన్షన్‌లో యూఎస్ కమెడియన్ బిల్ కాస్బీ ఓ మైనర్ బాలిక జూడీ హుత్‌‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు...

50 ఏళ్ల క్రితం నాటి కేసులో తీర్పు.. మైనర్‌గా ఉన్నప్పుడు లైంగికంగా వేధించాడంటూ US Comedianపై..

దాదాపు ఐదు దశాబ్దాల క్రితం ప్లేబాయ్ మాన్షన్‌లో యూఎస్ కమెడియన్ బిల్ కాస్బీ (Bill Cosby) ఓ మైనర్ బాలిక జూడీ హుత్‌‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె కేసు వేసింది. దీంతో ఆ కేసు విచారించిన కాలిఫోర్నియాలోని జ్యూరీ జూన్ 21 (మంగళవారం)న బిల్ కాస్బీ నేరాన్ని నిర్ధారించింది. అంతేకాకుండా జూడీకి 5 లక్షల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.


1975లో కాస్బీ వయస్సు 36 కాగా.. జూడీకి కేవలం 16 ఏళ్లు మాత్రమే. ఆ వయసులో ఉన్న జూడీ హుత్‌‌ను కాస్బీ లైంగికంగా వేధించాడు. ఓ మూవీ సెట్‌లో జరిగిన ఈ ఘటనలో జూడీతో పాటు ఆమె 17 ఏళ్ల స్నేహితురాలు డొన్నా శామ్యూల్ సన్ సైతం బాధితురాలైంది. ప్రస్తుతం 84 ఏళ్ల వయస్సులో ఉన్న కాస్బీపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలు చేస్తూ కేసులు వేశారు. ఈ తరుణంలో ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయితే.. కాస్బీ 2018లోనే ఒక క్రిమినల్ కేసులో జైలు పాలయ్యాడు. కానీ.. పలు కారణాల వల్ల నేరాన్ని రద్దు చేయడంతో గత సంవత్సరం విడుదలయ్యాడు.

Updated Date - 2022-06-22T15:32:05+05:30 IST