విరాట్ కోహ్లీనే తనకంటే బిగ్ అంటోన్న బిగ్ బి!

ABN , First Publish Date - 2021-12-12T03:19:18+05:30 IST

బాలీవుడ్ సూపర్ స్టార్... బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాను ఎంత మాత్రం బిగ్ కాదంటున్నాడు! ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే బిగ్ అంటూ బిగ్గరగా చెప్పేశాడు! ఇంతకీ, స్టార్ క్రికెటర్‌కి, బాలీవుడ్ సూపర్ స్టార్‌కి పోలిక ఎందులో అంటారా?

విరాట్ కోహ్లీనే తనకంటే బిగ్ అంటోన్న బిగ్ బి!

బాలీవుడ్ సూపర్ స్టార్... బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాను ఎంత మాత్రం బిగ్ కాదంటున్నాడు! ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీనే బిగ్ అంటూ బిగ్గరగా చెప్పేశాడు! ఇంతకీ, స్టార్ క్రికెటర్‌కి, బాలీవుడ్ సూపర్ స్టార్‌కి పోలిక ఎందులో అంటారా? ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్‌లో... 


అమితాబ్ బచ్చన్ తన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్‌లో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ బాట పట్టారు. సూటు వేసుకుని ఉన్న ఓ ఫోటో షేర్ చేశారు. యాజ్‌యూజ్‌వల్ బిగ్ బి లుక్స్ అదిరిపోయాయి. కానీ, చాలా మందిని ఆశ్చర్యపరిచింది ఆయన చేసిన కామెంట్. ఫోటోతో పాటూ రాసిన మ్యాటర్‌లో విరాట్ కోహ్లీని ప్రస్తావించారు అమితాబ్. 


‘‘160 మిలియన్ల మంది ఫాలోయర్స్‌తో  అత్యున్నత స్థానంలో, అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ... మరి నా సంగతి? కేవలం 29 మిలియన్ అనుచరులతో...’’ అంటూ తనని తాను విరాట్‌తో పోల్చుకున్నారు సీనియర్ బచ్చన్. అంతే కాదు టక్సిడో ధరించి గొప్పగా ఫోజిచ్చినా కూడా తాను ఇండియన్ స్టార్ క్రికెటర్ ముందు నిలువలేకపోతున్నానని ఆయన అన్నారు! 

Updated Date - 2021-12-12T03:19:18+05:30 IST