చేయటానికి పనిలేదు... చేతిలో సినిమాల్లేవు... అటువంటి స్థితిలో...

ABN , First Publish Date - 2021-12-04T20:57:32+05:30 IST

డెబ్బై ఏళ్లు దాటిన వయస్సులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్. మరో వైపు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో కూడా నిర్వహిస్తున్నాడు. అయితే, 21 ఏళ్లుగా సుదీర్ఘ కాలం పాటూ తన క్విజ్ షోని విజయవంతంగా నడిపిన ఆయన తాజాగా ‘కేబీసీ’ సెట్స్ మీద ఎమోషనల్ అయ్యాడు...

చేయటానికి పనిలేదు... చేతిలో సినిమాల్లేవు... అటువంటి స్థితిలో...

డెబ్బై ఏళ్లు దాటిన వయస్సులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ బచ్చన్. మరో వైపు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో కూడా నిర్వహిస్తున్నాడు. అయితే, 21 ఏళ్లుగా సుదీర్ఘ కాలం పాటూ తన క్విజ్ షోని విజయవంతంగా నడిపిన ఆయన తాజాగా ‘కేబీసీ’ సెట్స్ మీద ఎమోషనల్ అయ్యాడు... 

‘కౌన్ బనేగా...’ 2000వ సంవత్సరంలో మొదలైంది. అయితే, అప్పట్లో బిగ్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేది. కెరీర్ పరంగా ఆయనకు అప్పటికే కమర్షియల్ హీరో క్యారెక్టర్స్ ఆగిపోయాయి. చేతిలో సినిమాలు అస్సలు లేని స్థితి. ఆర్దికంగా కూడా సీనియర్ బచ్చన్ అనేక సవాళ్లు ఎదుర్కుంటూ ఉండేవాడు. సరిగ్గా అప్పుడే ‘కేబీసీ’ ఆఫర్ వచ్చిందట. చాలా మంది టెలివిజన్ షో హోస్ట్‌గా వెళ్లవద్దని హెచ్చరించారట. స్థాయి తగ్గిపోతుందనే భయం ఉండిందట. కానీ, ఎలాగో ధైర్యం చేసి అడుగు ముందుకేసిన అమితాబ్‌కి ‘కౌన్ బనేగా...’ తొలి ఎపిసోడ్ ప్రసారం అయిన తరువాత నుంచీ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. 21 ఏళ్లుగా ‘‘తన ప్రపంచమే మారిపోయిం’’దని అమితాబ్ తాజా ఎపిసోడ్‌లో వ్యాఖ్యానించాడు. ‘కేబీసీ’ ఇప్పటి వరకూ వెయ్యి ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవ్వడం ద్వారా బుల్లితెర చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. 

Updated Date - 2021-12-04T20:57:32+05:30 IST