ఆట సందీప్ (Aata Sandeep) హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘రేంజ్ రోవర్’ (Range Rover). ఓఎస్ఆర్ కుమార్ ఇండియన్ పిక్చర్స్ బ్యానర్లో.. ఓఎస్ఆర్ కుమార్ (OSR Kumar) స్వీయదర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర.. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా నటుడు అలీ (Ali) విడుదల చేశారు. ఆట సందీప్ సరసన మేఘన రాజ్‌పుత్ (Meghana Rajput) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ యతిరాజ్, బ్యాంక్ జనార్దన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జ్యోతి రాజ్ (Jyothi Raj) ఐటమ్ సాంగ్‌లో కనిపించనుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రొమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. త్వరలోనే చిత్ర ట్రైలర్, లిరికల్ సాంగ్స్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
ఫస్ట్ లుక్ విడుదల అనంతరం అలీ మాట్లాడుతూ.. ‘‘ఓఎస్ఆర్ కుమార్ దర్శకత్వంలో ఆట సందీప్ చేస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. రేంజ్ రోవర్ టైటిల్ చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు విజయం అందిస్తారని ఆశిస్తున్నాను. చిత్రయూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను’’ అని అన్నారు. కాగా, ఈ చిత్రానికి సత్య సోమేష్ సంగీతం సమకూర్చుతున్నారు.