శృంగార సన్నివేశాల సమయంలో ఇబ్బంది పడ్డానంటోన్న SALMAN చెల్లెలి భర్త

ABN , First Publish Date - 2021-11-15T02:04:35+05:30 IST

‘‘ఎంతో ఇబ్బందిపడ్డాను. ఎంతో కంగారు కూడా పడ్డాను’’... ఈ మాటలు ఎవరివో తెలుసా? సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ భర్త ఆయుష్ శర్మ చెబుతున్నవి. ఆయన తన నెక్ట్స్ రిలీజ్ ‘అంతిమ్’ గురించి మాట్లాడుతూ ఈ విధంగా స్పందించాడు...

శృంగార సన్నివేశాల సమయంలో ఇబ్బంది పడ్డానంటోన్న SALMAN చెల్లెలి భర్త

‘‘ఎంతో ఇబ్బందిపడ్డాను. ఎంతో కంగారు కూడా పడ్డాను’’... ఈ మాటలు ఎవరివో తెలుసా? సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ భర్త ఆయుష్ శర్మ చెబుతున్నవి. ఆయన తన నెక్ట్స్ రిలీజ్ ‘అంతిమ్’ గురించి మాట్లాడుతూ ఈ విధంగా స్పందించాడు. ఆయుష్, సల్మాన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘అంతిమ్’  నవంబర్ 26న జనం ముందుకొస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ, ప్రస్తుతం అందరిలోనూ, ఆసక్తి రేకెత్తిస్తోంది. అందుక్కారణం... సినిమాలో మొదటి సారి సల్మాన్ భాయ్ తన బావగారితో కలసి నటించటమే! 


‘అంతిమ్’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆయుష్ శర్మ షూటింగ్ టైంలో సల్మాన్‌ని పంచ్ చేయాల్సి వచ్చిందని కొంచెం బాధగానే చెప్పాడు. ఆయన బాడీ డబుల్ ఉపయోగించే అవకాశం ఉన్న సీన్స్‌లో కూడా స్వయంగా నటించాడని వివరించాడు. దాంతో మళ్లీ మళ్లీ తన భార్యగారి అన్నగార్ని, పైగా సల్మాన్ లాంటి సూపర్ స్టార్‌ని కొట్టాల్సి వచ్చేదట! కానీ, యాక్షన్ సీన్స్‌ ఎలాగో పూర్తి చేసిన ఆయుష్ శర్మ అసలు కష్టమంతా రొమాంటిక్ సన్నివేశాల సమయంలోనే పడ్డాడట! 


‘అంతిమ్’ చిత్రంలోని శృంగార సన్నివేశాల సమయంలో, ముఖ్యంగా ‘హోనే లగా’ అనే పాటలో ఇంటిమేట్ సీన్స్ ఆయుష్‌ని ఇబ్బంది పెట్టాయంటున్నాడు. అవి షూట్ చేస్తున్నప్పుడు ‘అసౌకర్యంగా‘, ‘కంగారుగా’ అనిపించిందని చెప్పిన ఆయన ఒక దశలో పిచ్చెక్కినంత పనైందని అన్నాడు. అంతే కాదు, ‘‘ఇదంతా నా భార్య, పిల్లలు తెర మీద చూస్తారు. అప్పుడు వారికి మరోలాగా, అసభ్యంగా అనిపించకూడదు’’ అనే ఆలోచన నిరంతరం ఆయన మనస్సులో మెదులుతూ ఉండేదట! మొత్తానికి హీరోయిన్ మహిమాతో హాట్ సీన్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన ఆయుష్ శర్మ మూవీ రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాడు. సల్మాన్ భాయ్ బావగారి కష్టం ఫలిస్తుందో లేదో చూడాలి మరి... 

Updated Date - 2021-11-15T02:04:35+05:30 IST