అఫీషియల్: Acharya ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Twitter IconWatsapp IconFacebook Icon
అఫీషియల్: Acharya ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) కలిసి నటించిన ‘ఆచార్య’ (Acharya) చిత్రం ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో విడుదల కాబోతోంది.ఈ చిత్రం మే 20న గ్లోబల్ డిజిటల్ ప్రీమియర్‌ కానుందని అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో, కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 20 నుండి 240 కంటే ఎక్కువ దేశాలు మరియు ప్రాంతాలలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవనుంది. ఈ తెలుగు యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే (Pooja Hegde), సోనూ సూద్ (Sonusood) మరియు జిషు సేన్‌గుప్తా (Jisshu Sengupta) కీలక పాత్రల్లో నటించారు. శ్రీమ‌తి సురేఖ కొణిదెల (Surekha Konidela) స‌మ‌ర్పణ‌లో కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి (Niranjan Reddy), అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు.

మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తే చూడాలని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న మెగాభిమానుల కోరికను తీర్చిన చిత్రమిది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అమ్మవారు వెలిసిన పుణ్యస్థలం ధర్మస్థలి. అక్కడ గురుకులంలో పెరిగి పెద్దవాడైన సిద్ధ (Siddha) (రామ్ చరణ్), అక్కడి ప్రజలకు అండగా నిలబడి అనుక్షణం ధర్మాన్ని రక్షిస్తుంటాడు. రాజకీయంగా ఎదగాలనుకున్న బసవ (Basava) (సోనూసూద్) కన్ను ధర్మస్థలిపై పడుతుంది. దాన్ని చేజిక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ధర్మస్థలిని కాపాడుతున్న సిద్ధ అడ్డుతొలగిస్తేనే ధర్మస్థలి తన సొంతమవుతుందని భావించిన బసవ, అతడి అనుచరులు.. సిద్ధపై అటాక్ చేస్తారు. ఆ క్రమంలో గాయపడిన అతడ్ని కొందరు కాపాడుతారు.  ఇంతలో బసవ కారణంగా.. అక్కడ ధర్మం మంటగలిసి అధర్మం పేట్రేగుతుండడంతో దాన్ని అడ్డుకోవడానికి ఆ ప్రాంతంలోకి అడుగుపెడతాడు ఆచార్య (Acharya) (చిరంజీవి). బసవ అతడి గ్యాంగ్ చేసే అరాచకాల్ని ఒక్కొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు. ఇంతకీ ఆచార్య ఎవరు? సిద్ధకి, అతడికి సంబంధం ఏంటి? చివరికి ఆచార్య ధర్మస్థలిని ఏ విధంగా కాపాడుతాడు? అనేదే ‘ఆచార్య’ సినిమా కథ. సినిమా ఫస్టాఫ్‪లో చిరంజీవి తన నటన, నృత్యం, యాక్షన్‌తో అభిమానులకు మంచి అనుభూతిని అందిస్తే.. సెకండాఫ్ లో రామ్ చరణ్ ఎంటరై.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు. వీరిద్దరి కలయికలో వచ్చే కొన్ని సీన్లు మెగాభిమానులతో ఈలలు వేయిస్తాయి. అయితే థియేటర్లలో అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోయిన ఈ చిత్రం.. ఓటీటీలో మాత్రం మంచి స్పందనను అందుకుంటుందని చిత్రయూనిట్ భావిస్తోంది.


AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.