Acharya పరాజయ ప్రభావం తారక్ పై అంత పడిందా?

ABN , First Publish Date - 2022-07-26T21:46:47+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హిట్స్ ఫ్లాప్ కి అతీతంగా ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న హీరో. మూడున్నర దశాబ్దాలుగా టాప్ హీరోగా కొనసాగిన చిరు కెరియర్ కే మాయని మచ్చలా మిగిలిపోయింది ‘ఆచార్య’ (Acharya) సినిమా.

Acharya  పరాజయ ప్రభావం తారక్ పై అంత పడిందా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హిట్స్ ఫ్లాప్ కి అతీతంగా ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న హీరో. మూడున్నర దశాబ్దాలుగా టాప్ హీరోగా కొనసాగిన చిరు కెరియర్ కే మాయని మచ్చలా మిగిలిపోయింది ‘ఆచార్య’ (Acharya) సినిమా. కొరటాల శివ (Koratala Shiva), రామ్ చరణ్ (Ramcharan), చిరు లాంటి క్రౌడ్ పుల్లర్స్ కూడా ‘ఆచార్య’ ని నష్టాల నుంచి కాపాడలేకపోయారు. దీంతో ఆ సినిమా కొన్న ప్రతి ఒక్కరికీ నష్టాల్నే మిగిల్చింది. అయితే ఆచార్య ఎఫెక్ట్ చిరు, చరణ్ ల కన్నా.. ఎన్టీఆర్ పైనే ఎక్కువ పడడం గమనార్హం. 


‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ (NTR).. కొరటాల శివతో ఒక సినిమా చేయాల్సి ఉంది. దీన్ని గతంలో ఎప్పుడో అనౌన్స్ చేసినా.. కొరటాల ‘ఆచార్య’ షూటింగ్‌లో బిజీగా ఉండడం  వల్ల పెండింగ్‌లో పడింది. మేలో సెట్స్ పైకి వెళ్ళాల్సిన ఈ ప్రాజెక్ట్‌పై, జూలై ఎండింగ్‌కు వచ్చినా కూడా మరో అప్డేట్ లేదు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియడం లేదు. అంతా అయోమయంలో ఉన్న టైంలో ఎన్టీఆర్ కొరటాల సినిమా డైలమాలో పడింది. నిజానికి ఒక స్టార్ హీరో సినిమా విషయంలో ఇలా జరగడం చాలా అరుదు. టైం బాగోలేక అది ఎన్టీఆర్ విషయంలోనే జరిగింది. 


మరో వైపు చరణ్, ‘ఆర్ ఆర్ ఆర్’ తర్వాత తాను నటించిన ఆచార్యని రిలీజ్ చేశాడు. rc 15 షూటింగ్ కంప్లీట్ చేసే స్టేజ్ లో ఉన్నాడు. చిరు ఏకంగా మూడు సినిమాలని ఒకేసారి పట్టాలెక్కించారు. ఎన్టీఆర్ మాత్రం తన తదుపరి చిత్రం విషయంలో ఇంకా సంధిగ్ధతతోనే ఉన్నాడు. అందుకే ‘ఆచార్య’ ప్లాప్ తారక్‌కు తలపోటుగా మారిందని చెప్పకతప్పదు.

Updated Date - 2022-07-26T21:46:47+05:30 IST