షూటింగ్‪లో హీరో గోపీచంద్‪కి ప్రమాదం

ABN , First Publish Date - 2022-04-30T01:13:02+05:30 IST

మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ల కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‪లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం..

షూటింగ్‪లో హీరో గోపీచంద్‪కి ప్రమాదం

మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌ల కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‪లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. ప్రస్తుతం మైసూర్‪లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‪లో హీరో గోపీచంద్‪కి ప్రమాదం జరిగినట్లుగా మేకర్స్ ప్రకటించారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. 


‘‘మైసూర్‪లో జరుగుతున్న షూటింగ్‪లో.. కాలు కొద్దిగా స్లిప్ అవడంతో గోపీచంద్ పడిపోయారు. దేవుని దయ వల్ల ఆయనకి ఏం కాలేదు. సురక్షితంగా ఉన్నారు. దయచేసి అభిమానులు, స్నేహితులు.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని దర్శకుడు శ్రీవాస్ ఓ ప్రకటనను విడుదల చేశారు. కాగా, గోపీచంద్ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీవాస్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు.

Updated Date - 2022-04-30T01:13:02+05:30 IST