Highway : కీలక పాత్రలో ‘పాతాళ్‌లోక్’ స్టార్

ABN , First Publish Date - 2022-08-08T17:04:34+05:30 IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) తాజా చిత్రం ‘హైవే’ (Highway). ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ (KV Guhan) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Highway : కీలక పాత్రలో ‘పాతాళ్‌లోక్’ స్టార్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) తాజా చిత్రం ‘హైవే’ (Highway). ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ (KV Guhan) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మానస రాధాకృష్ణ (Manasa Radhakrishna) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను వెంకట్ తలారి (Venkat Thalari) నిర్మిస్తున్నారు. సైమన్ కింగ్ (Simon King) సంగీతం సమకూర్చుతున్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. ఫోటోగ్రాఫర్ విష్ణు తులసి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. ఇక ఇద్దరూ పెళ్ళి చేసుకోవడమే తరువాయి అనే టైమ్‌లో ఒక సీరియల్ కిల్లర్ తులసిని కిడ్నాప్ చేస్తాడు. మరి విష్ణు ఆ పరిణామాన్ని ఎలా ఎదుర్కొన్నాడు. తను ప్రేమించిన అమ్మాయిని D అనే సీరియల్ కిల్లర్ చెరనుంచి ఎలా విడిపించాడు? అన్నదే మిగతా కథ. ఈ నెల 19న ఈ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో డైరెక్ట్ గా విడుదల కాబోతోంది. 


ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక అంశం ఆసక్తిని రేపుతోంది. అదేంటంటే ఇందులో సీరియల్ కిల్లర్ పాత్రలో ‘పాతాళ్‌లోక్’ (Pathal Lok) వెబ్ సిరీస్‌లో సైకో‌గా నటించిన అభిషేక్ బెనర్జీ (Abhishek Benerji) నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్రకు అతడైతేనే న్యాయం చేస్తాడని మేకర్స్ అభిప్రాయం. ఇంచుమించుగా ‘పాతాళ్‌లోక్‌’ సిరీస్ లో అతడు చేసిన పాత్రనే ‘హైవే’ లోనూ చేస్తుండడం గమనార్హం. అందులో త్యాగి అనే పాత్రలో ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అధినేతను చంపడానికి కాంట్రాక్ట్ కిల్లర్‌గా తన గ్యాంగ్‌తో ఎంటరవుతాడు. అయితే అతడ్ని వెంటనే అరెస్ట్ చేస్తారు పోలీసులు. జైల్లో అతడి పాత్ర గురించి వివరించే సన్నివేశాల్లో త్యాగి ఎంత సైకో అనే విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది. ఆ పాత్రలో అభిషేక్ బెనర్జీ అదరగొట్టాడు. దీనికి ముందు అభిషేక్ ‘మీర్జాపూర్’ (Mirzapur) సిరీస్ లోనూ మంచి పాత్ర పోషించాడు. 


బాలీవుడ్ లో కేస్టింగ్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అభిషేక్ బెనర్జీ ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ‘రంగ్ దే బసంతి’ (Rang de Basanthi) తో తన సినీ కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత దాదాపు 20 సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. ‘పాతాళ్‌లోక్’ సీజన్ వన్ లో అతడి పాత్ర చనిపోయినప్పటికీ..  సెకండ్ సీజన్ లోనూ అభిషేక్ బెనర్జీ కనిపిస్తాడని తెలుస్తోంది.  మరి ‘హైవే’ చిత్రం .. అతడికి తెలుగులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి. 

Updated Date - 2022-08-08T17:04:34+05:30 IST