అలాంటి పనులు ఇకనైనా ఆపెయ్.. 21 ఏళ్ల మేనల్లుడికి మామ Abhishek Bachchan స్వీట్ వార్నింగ్

ABN , First Publish Date - 2021-11-23T22:58:26+05:30 IST

బాలీవుడ్ నిండా ఇప్పటికే బోలెడంత మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. ఇప్పుడు మరో నట వారసుడు వచ్చేసే సమయం ఆసన్నమైందా? పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది...

అలాంటి పనులు ఇకనైనా ఆపెయ్.. 21 ఏళ్ల మేనల్లుడికి మామ Abhishek Bachchan స్వీట్ వార్నింగ్

బాలీవుడ్ నిండా ఇప్పటికే బోలెడంత మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. ఇప్పుడు మరో నట వారసుడు వచ్చేసే సమయం ఆసన్నమైందా? పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తోంది...


అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ తనయుడు... అగస్త్య నందా. తాజాగా ఈ యంగ్ అండ్ హ్యాండ్సమ్ 21 ఏళ్ల వాడయ్యాడు. అతడి జన్మదినం సందర్భంగా ఇంటర్నెట్‌లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానంగా మేన మామ అభిషేక్ బచ్చన్ బర్త్ డే మెసేజ్ చాలా మందిని ఆకట్టుకుంది. ‘‘అగస్త్య! 21వ జన్మదిన హార్ధిక శుభాకాంక్షలు...’’ అంటూ విషెస్ చెప్పిన జూనియర్ బచ్చన్ ‘‘నువ్విప్పుడు అధికారికంగా పెద్దవాడివి అయిపోయావు. ఇంతకు ముందులా ఇక మీద మేన మామ బట్టలు, షూస్ తీసుకోవటం మానెయ్. నీ స్వంతంగా కొనుక్కో! లవ్ యూ... ’’ అని సరదాగా చురక అంటించాడు!


త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడని టాక్ వినిపిస్తోన్న అగస్త్య నందాకి తల్లి శ్వేతా బచ్చన్ నందా, సోదరి నవ్యా నవేలి నందా కూడా శుభాకాంక్షలు తెలిపారు. 21వ జన్మదినం నవంబర్ 23న జరుపుకున్న అమితాబ్ మనవడు జోయా అఖ్తర్ నెక్ట్స్ మూవీలో హీరోగా నటిస్తాడని బాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. అతడికి జోడీగా మరో స్టార్ కిడ్ ఖుషీ కపూర్ తొలిసారి తెర మీదకు రానుందట. ఇప్పటికే హీరోయిన్‌గా కొనసాగుతోన్న అనన్య పాండే కూడా జోయా అఖ్తర్ సినిమాలో ఉంటుందని సమాచారం. 

Updated Date - 2021-11-23T22:58:26+05:30 IST