నాతో సినిమాలు తీయడానికి ఎవరూ ఇష్టపడలేదంటూ.. బాధపడిన Abhishek Bachchan

ABN , First Publish Date - 2021-12-19T16:52:02+05:30 IST

ఏ సినిమా ఇండస్ట్రీలో అయిన నటులుగా నిలదొక్కుకున్నవారి పిల్లలు కూడా ఆ రంగంలో పాగా వేయడం ఎప్పటినుంచో వస్తుందే...

నాతో సినిమాలు తీయడానికి ఎవరూ ఇష్టపడలేదంటూ.. బాధపడిన Abhishek Bachchan

ఏ సినిమా ఇండస్ట్రీలో అయిన నటులుగా నిలదొక్కుకున్నవారి పిల్లలు కూడా ఆ రంగంలో పాగా వేయడం ఎప్పటినుంచో వస్తుందే. అయితే దీనిపై నెపోటిజం అంటూ ఎంతోమంది ఔత్సాహిక నటులు, ఇతరులు విమర్శలు సైతం గుప్పించడం చూస్తూనే ఉన్నాం. స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఇది మరి ఎక్కువైంది. అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొడుకుగా సినీ జీవితాన్ని ప్రారంభించిన అభిషేక్ బచ్చన్ కెరీర్ స్టార్టింగ్‌లో తను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ బాధపడ్డాడు.



తాజాగా అభిషేక్ బచ్చన్ నెపోటిజం గురించి మాట్లాడుతూ.. ‘నటుడిగా వరుస సినిమాలు చేశాను. అలాగే పని లేకుండా ఖాళీగా కూడా ఉన్నాను. ఇక్కడ ఏదైనా మనం ఎలా చూస్తున్నాం అనే దానిపై ఉంటుంది. కానీ రోజు చివరికి వచ్చేసరికి ఇది కేవలం వ్యాపారం అని గుర్తుంచుకోవాలి. అన్ని సరిగా జరుగుతూ, సినిమాలు ఆడుతుంటే నీ మీద డబ్బు పెట్టడానికి సిద్ధపడతారు. కానీ ఈ పరిస్థితుల్లో చాలా మంది నెపోటిజం అనేదాన్ని తమకి అనుకూలంగా మార్చుకుంటు ఉంటారు. ఈ రంగంలో నేను 21 సంవత్సరాలుగా ఉన్నాను. ఈన్ని సంవత్సరాల్లో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాన’ని తెలిపాడు.


అమితాబ్ బచ్చన్ కొడుకు కోసం సినిమా తీయడమో.. ఎవరినైనా తీయమని అడగం కానీ చేయలేదని అభిషేక్ తెలిపాడు. అంతేకాకుండా..‘మొదటి సినిమా చేయడానికి నాకు దాదాపు రెండేళ్లు పట్టింది. మిస్టర్ బచ్చన్ కొడుకు కాబట్టి సినిమాలు చేయడానికి అందరూ క్యూ కడతారని చాలామంది అనుకుంటారు. కానీ నిజంకాదు. నటుడిగా కెరీర్ ప్రారంభించడానికి ముందు దాదాపు ప్రతి దర్శకుడితో మాట్లాడాను. అయితే ఎవరూ నాతో పనిచేయాలని ఇంట్రస్టు చూపకపోవడం బాధగా అనిపించింద’ని ఆయన చెప్పుకొచ్చాడు.

Updated Date - 2021-12-19T16:52:02+05:30 IST