టాలీవుడ్‪లో విషాదం.. డ్యాన్స్‌ మాస్టర్ టీనా సాధు (Tina Sadhu) ఆకస్మిక మృతి

ABN , First Publish Date - 2022-05-13T00:15:42+05:30 IST

టాలీవుడ్ (Tollywood)‪లో విషాదం చోటుచేసుకుంది. డ్యాన్స్ మాస్టర్ టీనా సాధు ఆకస్మికంగా మృతి చెందారు. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా సాధు (Tina Sadhu).. నిన్న (బుధవారం) గోవా (Goa)లో

టాలీవుడ్‪లో విషాదం.. డ్యాన్స్‌ మాస్టర్ టీనా సాధు (Tina Sadhu) ఆకస్మిక మృతి

టాలీవుడ్ (Tollywood)‪లో విషాదం చోటుచేసుకుంది. డ్యాన్స్ మాస్టర్ టీనా సాధు ఆకస్మికంగా మృతి చెందారు. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా సాధు (Tina Sadhu).. నిన్న (బుధవారం) గోవా (Goa)లో గుండెపోటుతో మృతిచెందినట్లుగా తెలుస్తుంది. టీనా మృతిని ఇన్‪స్టాగ్రమ్ ద్వారా ఆట సందీప్ (Aata Sandeep) వెల్లడించారు. అయితే ఆమె మృతిపై పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. మితిమీరిన మద్యం తీసుకోవడం కారణంగా ఆమెకు గుండెపోటు వచ్చిందని, ఆమె సన్నిహితులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అసలు గోవాలో ఏం జరిగి ఉంటుందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  అయితే ఆమె కొంతకాలంగా తన భర్తతో గోవాలోనే ఉంటున్నట్లుగా ఒకవైపు.. రెండు రోజుల క్రితం ఆమె హైదరాబాద్ నుండి కొంతమంది ఫ్రెండ్స్‪తో గోవా వెళ్లినట్లుగా మరో వైపు వార్తలు వినిపిస్తున్నాయి.


అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మూడు కోణాల్లో విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఆమె గోవా ఎప్పుడు వెళ్లింది? ఆమెతో పాటు ఎవరున్నారు? చనిపోయిన సమయంలో ఆమెతో పాటు ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే ఆమె కాల్ హిస్టరీపై కూడా వారు దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఆమె మరణానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ మాత్రం రాలేదు.   


బుల్లితెరపై రియాలిటీ డ్యాన్స్ షోగా మంచి గుర్తింపు పొందిన ‘ఆట’ సీజన్ 1 (Aata Season 1)లో ఆమె సందీప్‪తో కలిసి పాల్గొంది. ఆ షోలో ఆమెకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయినా కూడా తలొంచక.. చివరి వరకు పోరాటి టైటిల్ విన్నర్‪గా నిలిచింది. ఆ తర్వాత సీజన్ 4కు జడ్జిగా వ్యవహరించడమే కాకుండా.. మధ్యలో కొన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్‪గా కూడా వర్క్ చేసింది. కానీ కొంతకాలంగా మాత్రం ఆమె సినీ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. ఆమె హఠాన్మరణ వార్త విన్న పలువురు దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆట షోలో నా పార్టనర్ అయిన టీనా మరణవార్త నన్నెంతగానో బాధిస్తుంది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. టీనా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను..’’ అని సందీప్ తన ఇన్‪స్టాగ్రమ్‪లో పోస్ట్ చేశారు. 



Updated Date - 2022-05-13T00:15:42+05:30 IST