బాలీవుడ్‌లోని ‌స్టార్‌కిడ్స్‌పై Aashram 3 star Esha Gupta సంచలన వ్యాఖ్యలు.. ఎంత అసహ్యంగా ఉన్నా సరే..

ABN , First Publish Date - 2022-06-29T19:08:46+05:30 IST

‘ఆశ్రమ్’.. దేశవ్యాప్తంగా ఈ వెబ్‌సిరీస్ గురించి తెలియని సినీ లవర్ లేడంటే అతిశయోక్తి కాదు. బాబీ డియోల్ (Bobby Deol) ముఖ్యపాత్ర..

బాలీవుడ్‌లోని ‌స్టార్‌కిడ్స్‌పై Aashram 3 star Esha Gupta సంచలన వ్యాఖ్యలు.. ఎంత అసహ్యంగా ఉన్నా సరే..

‘ఆశ్రమ్’.. దేశవ్యాప్తంగా ఈ వెబ్‌సిరీస్ గురించి తెలియని సినీ లవర్ లేడంటే అతిశయోక్తి కాదు. బాబీ డియోల్ (Bobby Deol) ముఖ్యపాత్ర పోషించిన ఈ సిరీస్ నుంచి ఇప్పటికే మూడు సీజన్లు విడుదలయ్యాయి. మూడు సీజన్లు కూడా మంచి ప్రేక్షకాదారణని పొందాయి. కొంతమంది నటులకి ఇంతకుముందులేని పాపులారిటీని సాధించి పెట్టాయి. అలా ఈ సిరీస్‌తో పాపులర్ అయిన యాక్టర్స్‌లో ఇషా గుప్తా (Esha Gupta) ఒకరు. అందులో బాబా సహాయకురాలి పాత్ర సోనియా క్యారెక్టర్‌ని పోషించింది. ఈ బ్యూటీ తన కెరీర్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలోని నెపోటిజం (Nepotism)పై, స్టార్ కిడ్స్‌ (Star Kids)పై సంచలన వ్యాఖ్యలు చేసింది.


ఇషా మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు, నేను పరిశ్రమ నుంచి వచ్చి ఉంటే బావుండని అనుకుంటూ ఉంటాను. అప్పుడు నా పరిస్థితి వేరేలా ఉండేదని నా అభిప్రాయం. చాలా సమస్యలు నా దరి చేరేవి కావు. పరిశ్రమకి చెందిన వ్యక్తి, స్టార్ కిడ్స్ ఎంత అసహ్యంగా ఉన్నా, ఫ్లాప్ సినిమాలు చేసిన పెద్ద విషయం కాదు. ఎందుకంటే.. వారికి మరొక అవకాశం ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ బయటి వారికి అలా కాదు. టాలెంట్ ఎంత ఉన్నా అవకాశం రావడం చాలా కష్టం’ అంటూ చెప్పుకొచ్చింది.


ఇషా ఇంకా మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీ బయటి వ్యక్తిగా నాకు కొన్ని ఇబ్బందికర అనుభవాలు ఎదురయ్యాయి. ఆ ఎక్స్‌పిరియన్స్‌తో ఈ చిత్ర పరిశ్రమలో నువ్వు కష్టపడుతుంటే సహాయం చేసేవారు ఎవరూ ఉండరు. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించేందుకు గైడ్ చేసేవారుండరు. ఈ ప్రయాణంలో నేను కలిసిన మనుషుల్లో చాలా కొద్దిమంది మాత్రమే నిజాయతీగా ఉండేవారు’ అని తెలిపింది.


కాగా.. ‘ఆశ్రమ్ (Aashram)’లో బాబీ, ఈషాతోపాటు చందన్ రాయ్ సన్యాల్, అదితి పోహంకర్, తుషార్ పాండే, దర్శన్ కుమార్, అనుప్రియ గోయెంకా, త్రిధా చౌదరి, అనిల్ రస్తోగి, సచిన్ ష్రాఫ్ కూడా నటించారు. జూన్ 3న MX ప్లేయర్‌లో ‘ఏక్ బద్నామ్ ఆశ్రమ్‌’ పేరుతో మూడవ సీజన్ విడుదలైంది. తాజాగా ఈ సిరీస్ నాలుగో సీజన్‌ టీజర్‌ని సైతం ఇటీవలే విడుదల చేయగా.. అది కూడా మంచి రెస్పాన్స్‌ని అందుకుంది.

Updated Date - 2022-06-29T19:08:46+05:30 IST