Aashiqui-3: ఒక్క సినిమా.. ముగ్గురు టాప్ హీరోయిన్స్ పోటీ..

ABN , First Publish Date - 2022-09-09T02:07:15+05:30 IST

బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రేమ కథా చిత్రాలు ‘ఆషికి’ (Aashiqui), ‘ఆషికి-2’ (Aashiqui-2). రొమాంటిక్ మ్యూజికల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం

Aashiqui-3: ఒక్క సినిమా.. ముగ్గురు టాప్ హీరోయిన్స్ పోటీ..

బాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రేమ కథా చిత్రాలు ‘ఆషికి’ (Aashiqui), ‘ఆషికి-2’ (Aashiqui-2). రొమాంటిక్ మ్యూజికల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. ‘ఆషికి-2’ ను రూ.18కోట్ల‌తో రూపొందిస్తే రూ. 110కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి మూడో భాగాన్ని రూపొందిస్తున్నామని కొన్ని రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. ‘ఆషికి-3’ (Aashiqui-3) అని టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) హీరో పాత్రను చేస్తున్నాడు. అనురాగ్ బసు (Anurag Basu) దర్శకత్వం వహిస్తున్నాడు. భూషణ్ కుమార్, ముఖేశ్ భట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ పాత్ర కోసం అనేక మంది బాలీవుడ్ తారలు పోటీపడుతున్నారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. 


‘ఆషికి-3’ లో హీరోయిన్ పాత్ర కోసం దీపికా పదుకొణె, కృతి సనన్, శ్రద్దా కపూర్ పోటీ పడుతున్నారని తెలుస్తోంది. మేకర్స్ ఈ ముగ్గురిలో ఒక్కరిని హీరోయిన్‌గా ఎంపికే చేసే అవకాశం ఉందట. ప్రస్తుతం స్క్రిఫ్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ‘ఆషికి-2’ లో శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా నటించింది. అందువల్ల ఆమెకు కొంచెం అధికంగా అవకాశాలు ఉన్నాయి. ‘ఆషికి-3’ ని భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. వచ్చే ఏడాది చివరలో లేదా 2024 ప్రారంభంలో ఈ చిత్రం విడుదల చేయాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నారు. కార్తిక్ ఆర్యన్ తాజాగా ‘భూల్ భూలయ్యా-2’ తో హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాడు. ప్రస్తుతం కార్తిక్ చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి. ‘సత్య‌ప్రేమ్ కి కథ’ (Satyaprem Ki Katha), ‘కెప్టెన్ ఇండియా’ (Captain India) సినిమాలు చేస్తున్నాడు.        

Updated Date - 2022-09-09T02:07:15+05:30 IST