కమెడియన్‌ని టార్గెట్ చేసిన KANGANA... కంగనాని టార్గెట్ చేసిన పొలిటీషన్...

ABN , First Publish Date - 2021-11-18T16:19:44+05:30 IST

కంగనా తన కాంట్రవర్సీలు కంటిన్యూ చేస్తూనే ఉంది. 1947లో మనకు దక్కింది స్వాతంత్ర్యం కాదు భిక్ష అంటూ ఆమె చేసిన కామెంట్ కలకలం రేపుతూనే ఉంది. తాజాగా ఆమెను ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కొడుకు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు టార్గెట్ చేశాడు...

కమెడియన్‌ని టార్గెట్ చేసిన KANGANA... కంగనాని టార్గెట్ చేసిన పొలిటీషన్...

కంగనా తన కాంట్రవర్సీలు కంటిన్యూ చేస్తూనే ఉంది. 1947లో మనకు దక్కింది స్వాతంత్ర్యం కాదు భిక్ష అంటూ ఆమె చేసిన కామెంట్ కలకలం రేపుతూనే ఉంది. తాజాగా ఆమెను ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కొడుకు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు టార్గెట్ చేశాడు. ఆప్ పార్టీ ముంబై విభాగపు జాయింట్ సెక్రటరీ కాశీనాథ్ కల్మందర్గా బాలీవుడ్ బ్యూటీకి పరువు నష్టం దావా నోటీసులు పంపాడు. ఆయన స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న విఠల్ రావ్ కల్మందర్గా వారసుడు. అయితే, కంగనాపై కాశీనాథ్ పరువు నష్టం దావా వేయక ముందే ఆమ్ ఆద్మీ పార్టీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో కంగనాకు ఇచ్చిన పద్మ శ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేయమంటూ... మహారాష్ట్ర సీఎంను తాము కోరినట్టు  ఆప్ పేర్కొంది. 2014లో మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని... కంగనా అన్నాక మోదీ వ్యతిరేక రాజకీయ శక్తులన్నీ ఈ బోల్డ్ బ్యూటీని టార్గెట్ చేశాయి. ఆమె వ్యాఖ్యల్ని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది...      


ఒకవైపు తనని చాలా మంది అదే పనిగా విమర్శిస్తుంటే... కోర్టులు, కేసులకి కూడా భయపడని కంగనా తన పని తాను చేసుకుపోతోంది. మరో కొత్త వివాదంలో ఆమె కాలుమోపింది. వీర్ దాస్ అనే స్టాండప్ కమెడియన్ అమెరికాలో ఓ షో చేశాడు. అతడు అక్కడ ఇండియాని అవమానించాడని కంగనా రనౌత్ అంటోంది. ఆమె కాదు ఇంకా చాలా మంది వీర్ దాస్‌ని తిట్టిపోస్తున్నారు. విదేశీ గడ్డపై అతను మాతృదేశాన్ని అవమానించాడని ఆరోపిస్తున్నారు. ‘‘ఇండియాలోని చాలా మంది ఉదయం స్త్రీని దేవతగా పూజిస్తారు, రాత్రి గ్యాంగ్ రేప్ చేస్తా’’రనే అర్థం వచ్చేట్టు వీర్ చేసిన వ్యాఖ్యలు బోలెడు ఆగ్రహానికి కారణం అయ్యాయి.


వీర్‌దాస్‌వి వెకిలి వ్యాఖ్యలని తేల్చి చెప్పిన కంగనా అతడు ఒకప్పుడు చేసిన ట్వీట్ బయటకు తీసి టార్గెట్ చేసింది. ‘‘సెక్స్ పిచ్చి పట్టిన ఇండియన్‌కి ఇతనో చక్కటి ఉదాహరణ... అందుకే, తన బూతుల్ని అమ్ముకుని బతికేస్తుంటాడు. అటువంటివే నచ్చే క్రీపీ అండ్ సెక్సిస్ట్ ఆడియన్స్ ఇతడ్ని ఆదరిస్తుంటారు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని షేర్ చేసింది. కంగనా పోస్ట్ చేసిన వీర్‌దాస్ ఓల్డ్ ట్వీట్‌లో లేడీస్ బ్రెస్ట్ గురించి, జెంట్స్ నిపిల్స్ గురించి డబుల్ మీనింగ్ కామెంట్ ఉంది...

Updated Date - 2021-11-18T16:19:44+05:30 IST