తండ్రి బాటలో నడవనంటున్న ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్

ABN , First Publish Date - 2022-03-06T02:30:06+05:30 IST

ప్రముఖ హీరోలు, హీరోయిన్ల వారసులు సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం

తండ్రి బాటలో నడవనంటున్న ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్

ప్రముఖ హీరోలు, హీరోయిన్ల వారసులు సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం సాధారణ విషయమే. రణ్ బీర్ కపూర్, అనన్య పాండే, జాన్వీ కపూర్​, సారా అలీ ఖాన్​ వంటి సెలబ్రెటీలు తమ తల్లిదండ్రుల మార్గాన్నే అనుసరించారు. కానీ, ఆమిర్ ఖాన్ కుతూరు ఐరా ఖాన్ మాత్రం తన తండ్రి బాటలో నడవనంటుంది.  


బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో క్వశ్చన్, అన్సర్ సెషన్ నిర్వహించింది. ఫాలోయర్స్ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మానసిక ఆరోగ్యం, భవిష్యత్ ప్రణాళికలు, ఇతర విషయాల గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా బాలీవుడ్ ఎంట్రీ గురించి ఓ నెటిజన్ ప్రశ్న అడిగాడు. అందుకు ఆమె సమాధానమిచ్చింది. ‘‘నేను సినిమాల్లో నటించను’’ అని ఆమె  చెప్పింది. కానీ, ఐరా గతంలోనే ‘‘మీడియా’’ అనే  ఓ థియేటర్ డ్రామాకు దర్శకత్వం వహించింది. ఈ డ్రామాలో ఇండియన్ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, హేజెల్ కీచ్ కీలక పాత్రలు పోషించారు. దీంతో ఆమెకు నటిగా మారడం ఇష్టం లేనప్పటికీ, భవిష్యత్తులో దర్శకురాలిగా మారే అవకాశం ఉందని నెటిజన్లు అంటున్నారు. 


ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ మాత్రం హీరోగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ‘మహారాజా’ చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటోంది. ఈ చిత్రాన్ని‘యశ్​ రాజ్​ ఫిలిమ్స్’ ​నిర్మిస్తుంది.

Updated Date - 2022-03-06T02:30:06+05:30 IST