Ira Khan: కనుల పండువగా ఆమిర్ ఖాన్ కుమార్తె నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..

ABN , First Publish Date - 2022-11-19T20:41:35+05:30 IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) త్వరలోనే పెళ్లి చేసుకొనుంది. తన ప్రియుడు, ఫిటెనెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారే (Nupur Shikhare)ను వివాహం ఆడనుంది.

Ira Khan: కనుల పండువగా ఆమిర్ ఖాన్ కుమార్తె నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) త్వరలోనే పెళ్లి చేసుకొనుంది. తన ప్రియుడు, ఫిటెనెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారే (Nupur Shikhare)ను వివాహం ఆడనుంది. వీరి నిశ్చితార్థం ముంబయిలో నవంబర్ 18న సాయంత్రం కనుల పండువగా జరిగింది. ఈ వేడుకకు ఆమిర్ ఖాన్, ఐరా తల్లి రీనా దత్తా, కిరణ్ రావ్, ఇమ్రాన్ ఖాన్, జీనత్ హుస్సేన్, ఫాతిమా సనా షేక్ తదితరులు హాజరయ్యి సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 


ఆమిర్ ఖాన్‌ వ్యక్తిగతంగా నూపుర్ శిఖారే వద్ద ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకునేవాడు. ఐరా ఖాన్ కూడా నూపుర్ వద్దే ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకునేది. ఈ క్రమంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశారు. తాజాగా కుటుంబ సభ్యుల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆమిర్ ఖాన్ మొదటగా రీనా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐరా ఖాన్, జునైద్ ఖాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. అనివార్య కారణాల వల్ల ఈ జంట విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్లకు ఆమిర్.. కిరణ్ రావ్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఆమెకు కూడా విడాకులిచ్చాడు. ఇక ఆమిర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా ‘లాల్ సింగ్ చడ్డా’ లో నటించాడు. ఈ సినిమా అమెరికన్ క్లాసికల్ హిట్ ‘ఫారెస్ట్ గంప్‌’ కు రీమేక్‌గా రూపొందింది. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.



Updated Date - 2022-11-19T20:41:35+05:30 IST